శృతి హాసన్ కి స్టన్నింగ్ న్యూ ఇయర్ గిఫ్ట్(ఫొటో)
హైదరాబాద్ : అప్పుడే న్యూ ఇయర్ ఉత్సాహం మొదలైపోయింది. అందరూ ఆ హడావిడిలో ఈ రోజు పార్టీలకు రెడీ అవుతున్నారు. మరో ప్రక్క శృతి హాసన్ ఈ సంవత్సరం ఆమెకు గోల్డెన్ ఇయిర్ గా హిట్ సినిమాలు పడటంతో చాలా ఉత్సాహంగా ఉంది. దీనికి తోడు ఆమెకు ఆనందం మరింత రెట్టింపు చేసేలా ఆమె ఫ్రెండ్ న్యూ ఇయర్ కానుకగా ‘టైగర్' నెక్ పీస్ ని గిఫ్ట్ గా ఇచ్చింది. దాంతో శృతి మరింత సంతోషంగా ఉంది.
ఈ విషయాన్ని శృతి హసన్ ట్విట్ చేస్తూ... ‘స్టన్నింగ్ టైగర్ నెక్ పీస్ ఇచ్చినందుకు చాల థాంక్స్ రాధిక జేస్రని.. ఈ టైగర్ నాకు చాలా నచ్చింది' ట్వీట్ చేసింది. శృతి హాసన్ ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తోంది. ఇది కాకుండా హిందీలో రెండు, తమిళంలో ఒక సినిమా చేస్తూ బిజీ బిజీగా ఉంది.
అలాగే...శృతి హాసన్ తెవర్ లో చేసిన సాంగ్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడమే కాకుండా యు ట్యూబ్ లో 1 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. 2015 కూడా ఆమెకు మరుపురాని సంవత్సరంగా మిగిలేటట్లు కనపడుతోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

శృతి గురించి మరిన్ని విశేషాలు...
''మొదట్లో నన్నందరూ ఐరెన్‌లెగ్ అన్నారు. కొన్ని విజయాలు సాధించగానే గోల్డెన్‌లెగ్ అని పిలిచారు. ఈ రెండింటినీ నేను పట్టించుకోలేదు. ఇమేజ్‌లు ఇక్కడ శాశ్వతం కాదు. అందుకే వాటి గురించి ఆలోచించకుండా నా పని నేను చేసుకొంటూ పోతున్నానంతే. పొగడ్తలు, విమర్శల లెక్కలేసుకొంటూ కూర్చుంటే ఒక్క అడుగూ వేయలేం'' అంటోంది శృతి హాసన్.
కెరీర్ ప్రారంభంలో శృతి నటించిన సినిమాలు ఏమీ ఆడలేదు. దాంతో అంతా ఆమెకు ఐరన్ లెగ్ అని పెట్టారు. అయితే గబ్బర్ సింగ్ సూపర్ హిట్ అవటంతో ఆమెకు మళ్లీ క్రేజ్ వచ్చింది. హీరోలు, దర్శకులు ఆమెని తమ సినిమాల్లో తీసుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. వీటి గురించి ఆమె ఇలా ప్రస్తావిస్తూ మాట్లాడింది.
అలాగే... ''ఒక్క సినిమాతోనే ఎవ్వరూ గొప్పవాళ్లు కాదు. కొన్ని విజయాలతో అంతా సాధించేసినట్టు కాదు. గెలిచిన రోజు అంతా బాగానే ఉంటుంది. ఒక్క ఫెయిల్టూర్ ఎదురైతే అంతా తారుమారే'' అంటోంది శ్రుతిహాసన్.
శ్రుతిహాసన్. సినిమాల విషయానికొస్తే ....రీసెంట్ గా 'ఆగడు'లో ప్రత్యేక గీతంలో కనిపించి కనువిందు చేసింది. ఇప్పుడు మహేష్‌బాబు సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. కమల్‌హాసన్ కూతురిగా కాదు శ్రుతిహాసన్‌గా తానేంటో నిరూపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంటుందీ హీరోయిన్. అందులో విజయం సాధించింది కూడా. ఇప్పుడు ఆమెకు తెలుగు, తమిళంలో పెద్ద హీరోలు, బ్యానర్స్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఆమె డేట్స్ కోసం ఆగటానికి కూడా హీరోలు సిద్దపడుతున్నారు.
ప్రస్తుతం శ్రుతిహాసన్ తెలుగు, తమిళం, హిందీల్లో ఆరు సినిమాలతో బిజీగా ఉంది. హిందీ 'తేవర్'లో ఐటం సాంగ్ లో డాన్స్ చేసింది. ఆగడు చిత్రం రిజల్ట్ ఎలా ఉన్నా...శ్రుతి హాసన్ డాన్స్ కు మంచి పేరు వచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు గోల్డెన్ హ్యాండ్ గా మారింది.


Click it and Unblock the Notifications











