ఆ ఇద్దరితో శృతి హాసన్ రొమాంటిక్ వ్యవహారం?
హైదరాబాద్: తెలుగు స్టార్ అక్కినేని నాగార్జున మరియు తమిళ స్టార్ కార్తీల కాంబినేషన్లో డైరెక్టర్ వంశీ పైడిల్లి దర్శకత్వంలో ప్రసాద్ వి పొట్లూరి ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో ఈ ఇద్దరు హీరోలు ఒకే హీరోయిన్‌తో రొమాన్స్ చేయబోతున్నారట. ప్రస్తుతం హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. ఆ హీరోయిన్ మరెవరె కాదు...శృతి హాసన్ అంటున్నారు.
ఈ చిత్రాన్ని పి.వి.పి సినిమా తమ అత్యుత్తమ నిర్మాణ విలువలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. అక్కినేని నాగార్జునకు తెలుగుతో పాటు తమిళ చిత్ర సీమలో కూడా మంచి ఇమేజ్ ఉంది. అలాగే కార్తీ ఇటీవలే ‘మద్రాస్' చిత్రంతో తమిళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

కార్తికి తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ద్వారా తెలుగు-తమిళ ఇండస్ట్రీలను ఏకం చేసే అద్భుత అవకాశాన్ని పి.వి.పి సొంతం చేసుకోవడం విశేషం. ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పివిపి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.


Click it and Unblock the Notifications











