హిట్, ఫ్లాఫ్ ముఖ్యం కాదు: శృతి హాసన్

By Srikanya

ముంబయి: గబ్బర్ సింగ్ తో గోల్డెన్ లెగ్ గా మారిన శృతి హాసన్ రీసెంట్ చిత్రం రామయ్యా వస్తావయ్యా ..భాక్సాఫీస్ వద్ద ఫలితం రివర్స్ అయ్యింది. దాంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ రావు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ హిట్ ప్లాఫ్ విషయాలని ఆమె లైట్ గా తీసుకుంటానంటోంది.

శృతి హాసన్ మాట్లాడుతూ...''హీరోయిన్ గా కెరీర్‌ని ప్రారంభించాక కూడా నాకు కొన్ని పరీక్షలు ఎదురయ్యాయి. అక్కడ కూడా నేను వెనక్కి తగ్గలేదు. జయాపజయాలు ముఖ్యం కాదు. చేసే పనిని చిత్తశుద్ధితో చేస్తున్నామా లేదా అన్నదే కీలకం. ఆ ఆలోచనా థృక్పధమే నన్ను నిలబెట్టింది. వరుస విజయాలు సాధించి పెట్టింది''అని చెప్పుకొచ్చింది

అలాగే...''నా వయసు అమ్మాయిలు ఇప్పటికీ ఏ రంగంలోకి వెళ్లాలి అని ఆలోచిస్తూ కూర్చున్నారు. నేను మాత్రం అలా ఎప్పుడూ చేయలేదు. చదువుకొనేటప్పుడే మనసు పాటపై మళ్లింది. వెంటనే సంగీతంపై దృష్టిపెట్టాను. నేర్చుకొంటూనే గొంతు విప్పాను. ఆ హుషారులో వేదికలపై కూడా ఆడాను. హీరోయిన్ గా మారి కెమెరా ముందుకు కూడా వచ్చాను. ఆలోచిస్తూ కూర్చుంటే ఏమీ రాదు. ఏదైనా సరే... ఆచరణలో పెట్టాలనేదే నా అభిమతం. అదే చేశాన. ఎటు వెళ్లాలి? ఏం చేయాలి? అనే ఆలోచనలు నాకెప్పుడూ రాలేదు. మనసు ఏం చెబితే అది చేస్తూ వెళ్లాను. నచ్చింది క్రమశిక్షణతో చేయడాన్ని మాత్రం బాగా అలవాటు చేసుకున్నా. ఫలితాలు వాటంతట అవే వచ్చాయి'' అంది.

తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో వరుసగా అవకాశాలు అందుకుంటున్న శ్రుతి ప్రస్తుతం అల్లు అర్జున్‌తో 'రేసుగుర్రం'లో నటిస్తోంది. త్వరలో 'ఎవడు'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న ఓ సంఘటనతో ఆమె మరోసారి అందరి నోట్లో నానింది. ముంబై బాంద్రా ప్రాంతంలో నివాసముంటున్న సినీ నటి శ్రుతిహాసన్‌ ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తి దౌర్జన్యంగా చొరబడేందుకు ప్రయత్నించాడు. అయితే శ్రుతి చాకచక్యంగా తలుపువేసి అతడిని కట్టడి చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో ఓ వ్యక్తి శ్రుతి ఇంటికి వచ్చి డోర్‌బెల్‌ నొక్కాడు. తలుపు తీయగానే.. నన్నెందుకు గుర్తించలేదు? నాతో ఎందుకు మాట్లాడటం లేదని ఆమెను ప్రశ్నించాడు. నువ్వెవరో నాకు తెలియదని శ్రుతి చెప్పినా వినకుండా దౌర్జన్యంగా లోనికి వచ్చేందుకు ప్రయత్నించాడు. వెంటనే శ్రుతి తలుపు వేసేసినట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X