కామసూత్ర భంగిమతో షాకిచ్చిన శృతిహాసన్( ఫోటో)
హైదరాబాద్: టాలీవుడ్ హాట్ స్టార్ శృతిహాసన్ డి- డే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె కరాచీకి చెందిన వేశ్యగా కనిపిస్తోంది. అర్జున్ రాంపాల్ మెయిన్ లీడ్ గా చేస్తున్న ఈ చిత్రంలోని ఫోటో ఒకటి ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అందులోని సెక్సీ భంగిమ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఏక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో రొమాంటిక్ సీన్స్ అదరకొడతాయంటున్నారు. పెద్ద తెరపై ఆ సీన్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తాయంటున్నారు. ఈ ఫోటో చూసిన వారు ఏ రేంజిలో ఇంటిమసీ సీన్స్ ఉన్నాయో అని ఊహించుకుంటున్నారు. ఈ చిత్రం తనకు అవార్డులు,పేరు తెచ్చిపెడుతుందని ఆమె భావిస్తోంది.
గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు హీరోయిన్‌గా ఆమెకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయంతో శృతి స్టార్ హీరోయిన్ గా మారడంతో పాటు తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. గబ్బర్ సింగ్ చిత్రం శృతి కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్.
ప్రస్తుతం శృతి హాసన్ రవితేజతో బలుపు, రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందుతున్న ఎవడు చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా అల్లు అర్జున్ హీరోగా త్వరలో రూపొందబోయే 'రేస్ గుర్రం' చిత్రంలో కూడా శృతి హాసన్ ఎంపికయింది. మరో వైపు శృతి హాసన్ హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తోంది. తెలుగులో హిట్టయిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రానికి ఇది రీమేక్.


Click it and Unblock the Notifications












