హీరోయిన్ శృతి హాసన్ మోకాలికి గాయం
సౌత్ ఇండియన్ మూవీ అవార్డ్స్ కార్యక్రమంలో తన తండ్రి కమల్ హాసన్ సినిమాలోని పాటకు డాన్స్ చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. తన ఎనర్జీ లెవల్స్ అంతా కూడగట్టుకుని కొన్ని కష్టతరమైన స్టెప్పులు వేయడానికి ప్రయత్నించి గాయపడింది.
తండ్రి కమల్ హాసన్ మాదిరి...శృతి హాసన్ కూడా పర్‌ఫెక్షన్ కోసం తన శక్తి మేర ప్రయత్నించే రకం. అందుకే అటు నటన విషయం తీసుకున్నా, ఇటు డాన్స్ విషయం తీసుకున్న శృతి పెర్ఫార్మెన్స్ సూపర్ అని అంటుంటారు అంతా. సైమా అవార్డ్స్ పంక్షన్ సందర్భంగా స్టేజీపై అందరిముందు పెర్ఫార్మెన్స్ ఇస్తున్న సందర్భంగా ఆమె మోకాలికి గాయమైంది.
ప్రస్తుతం శృతి హాసన్ మోకాలి గాయం నుంచి కోలుకుంటోంది. ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో అల్లు అర్జన్ సరసన 'రేస్ గుర్రం' చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. అదే విధంగా హిందీలో 'వెల్‌కం బ్యాక్' చిత్రం చేస్తోంది. రామ్ చరణ్‌తో శృతి నటించిన 'ఎవడు' చిత్రం విడుదల కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications












