ఇదీ నా ఎడ్రస్..ప్రేమ కురిపించండి : శ్రుతి హాసన్

By Srikanya

హైదరాబాద్ : సెలబ్రేటీలు నిత్యం ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ తమ క్రేజ్ ని పెంచుకోవటానికి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ట్విట్టర్ లో హల్ చేస్తున్న శ్రుతిహాసన్ రీసెంట్ గా కొత్త రూటును ఎంపిక చేసుకుంది. అది ఫేస్‌బుక్ మార్గంలో. ఎప్పుడూ అభిమానులకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే తాను ఫేస్‌బుక్‌లో పేజీని ఏర్పాటు చేసినట్టు శ్రుతిహాసన్ చెప్పింది.

ఆమె ఫేస్ బుక్ ఐడీ : http://www.facebook.com/shrutihaasan

ఈ విషయమై ఆమె ట్వీట్ చేస్తూ... "హాయ్ ట్వీప్స్. నేను ఫేస్‌బుక్‌లో అఫిషియల్‌గా పేజీని ప్రారంభించాను. నామీద కాస్త ప్రేమను కురిపించండి. ఆహ్లాదకరంగా గడుపుదాం'' అని ఫేస్‌బుక్ గురించి ట్వీట్ చేసింది శ్రుతిహాసన్

దాదాపు 93వేల మంది ఆమెను ట్విట్టర్‌లో ఫాలో అవుతున్నారు.నిత్యం తనకు సంబంధించిన విషయాలను ట్విట్టర్‌లో అప్‌డేట్ చేయడంలో శ్రుతి ముందుంటుంది. పైగా ఎలాంటి కాంట్రవర్సీల జోలికి వెళ్లదన్న పేరు కూడా ఈ భామకు ఉంది. దాంతో ఆమెకు ఫేస్ బుక్ లో కూడా మంచి ఆదరణ ఉంటుందని భావిస్తున్నారు.

ఇక రీసెంట్ గా శ్రుతి హాసన్ మళ్లీ గొంతు సవరించుకుంది. అల్లు అర్జున్‌ తో ఆమె చేస్తున్న 'రేసుగుర్రం' లో ఆమె ఓ పాట పాడింది. ఇందులో 'డౌన్‌ డౌన్‌ డుప్పా..' అంటూ సాగే ఓ గీతాన్ని శ్రుతిహాసన్‌ ఆలపించింది. ఈ పాటకి అల్లు అర్జున్‌తోపాటు ఆమె కూడా డ్యాన్స్‌ చేసింది. ఈ పాటని రామోజీఫిల్మ్‌సిటీలో చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్‌ నృత్య దర్శకుడు ఫిరోజ్‌ఖాన్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు.

గబ్బర్ సింగ్, బలుపు చిత్రాలతో ఫామ్ లోకి వచ్చిన శ్రుతి ..అటు హీరోయిన్ గా...అదరకొడుతూనే మరో ప్రక్క పాటలు పాడే కార్యక్రమం కూడా పెట్టుకుంది. తాజాగా ఆమె తమిళంలో ఓ పాట పాడింది. తెలుగులో హిట్టైన అలా మొదలైంది చిత్రం రీమేక్ గా రూపొందుతున్న చిత్రంలో ఆమె చేత ఓ పాటను పాడించారు. షటప్ యువర్ మౌత్ అంటూ సాగే ఈ పాట బాగా వచ్చిందని, అది హిట్టై ఆమెను అందరూ తమి సినిమాల్లో ఒక పాటపాడమని అడుగుతారని దర్శకుడు చెప్తున్నారు.

ఇక అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'రేసు గుర్రం'. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న తొలి సినిమా ఇదే. టైటిల్ కు తగ్గట్లు రేసు గుర్రంలాగానే ఈ చిత్రం విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. సినిమా చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. చిత్రంలో అల్లు అర్జున్ క్యారక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు చెప్తున్నాడు. ఫన్,యాక్షన్ కలిపి మరో కిక్ లా రూపొందిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఉన్నాయి.

 Shruthi Hassan Joined Facebook.

సురేంద్రరెడ్డి మాట్లాడుతూ... "పరుగు పందెంలో గెలవడం రేసుగుర్రం విధి. జీవితమనే పరుగు పందెంలో గెలవడం మనిషి విధి. అయితే... ఈ రేసులో అడపాదడపా గెలిచేవారు కొందరైతే... గెలుపుని ఇంటిపేరుగా మార్చుకున్నవాళ్లు కొందరు. ఆ కొందరిలో ఒకడి కథే... 'రేసుగుర్రం. బాధ్యతాయుతమైన ఓ యువకుని కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు" అన్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ... "గెలుపు కోసం బరిలో దిగినవాడికి... లక్ష్యం మాత్రమే కనిపించాలి. ఎదురొస్తున్న సవాళ్లు, పరిగెట్టిస్తున్న పరిస్థితులు, చుట్టుముడుతున్న సమస్యలూ ఇవేమీ పట్టించుకోకూడదు. రేసులో నిలవాలన్నా, నిలిచి గెలవాలన్నా పోరాడాల్సిందే. ఆ యువకుడూ అదే చేశాడు. 'రేసు గుర్రం'లా దూసుకుపోయాడు. మరి విజయం అందిందా? లేదా? ఇంతకీ ఈ రేసు దేని కోసం? తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే!" అన్నారు.

ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది.

కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X