కమల హాసన్ కూతురు పాపులారిటీ

ఒక్క చిత్రంలో కూడా నటించకుండానే పాపులర్ కావడం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అదృష్టం ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూతురు శృతి హసన్ కు దక్కింది. ఆమె తమిళ సినీ రంగంలోకి అడుగు పెట్టబోతోందని, మాధవన్ సరసన హీరోయినుగా నటించబోతోందని ప్రచారం జరిగింది. మాధవన్ ఆ ప్రచారాన్ని ఖండించాడు. శృతి ఫొటోల్లో చాలా అందంగా కనిపిస్తోంది. దీంతో ఆమెను తెలుగు సినిమాల్లో నటింపజేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా ప్రయత్నం చేస్తున్నవారిలో అల్లు అర్జున్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











