అన్నింటికీ తెగించే వచ్చా: శృతి హాసన్
అన్నింటికీ తెగించే సినిమాల్లోకి వచ్చానని, అందుకే గాసిప్పులు లెయ్య చేయను, నా ఇమేజ్‌కి డామేజ్ చేసే గిసిప్స్ కనుక వినిపిస్తే వాటిని ఎలా తిప్పి కొట్టాలో కూడా నాకు తెలుసు అంటోంది కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్. సినిమా రంగంలో ఉండే లోటు పాట్లపై పూర్తిగా అవగాహన పొందిన తర్వాతే కథానాయికగా మారానని చెప్పుకొచ్చింది.
దీపావళికి విడుదలైన తన సెవెన్త్ సెన్స్(తమిళంలో 7ఎఎం అరివు) సినిమా గురించి మాట్లాడుతూ...సొంత గడ్డపై ప్రతిభను నిరూపించుకోవడం నిజంగా టెన్షన్ తో కూడుకున్న విషయమే. ఇంతకు ముందు హేరామ్, పున్నయ్ పోల్ ఒరువన్ చిత్రాల్లో గెస్ట్ రోల్స్ చేశాను. కానీ మెయిన్ హీరోయిన్ గా తమిళనాట నటించడం ఇదే తొలిసారి. తెలుగులో కూడా నా పాత్రకు మంచి అప్లాజ్ వస్తోంది అని ఆనందం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా మీరు ఎలాంటి వారు అని మీడియా అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ స్పందిస్తూ...మాటలు తక్కువ, చేతలు ఎక్కవ, ఇదే నా సక్సెస్ సీక్కెట్ అంటోంది.
సూర్య, శృతి హాసన్ జంటగా ఎ.ఆర్. మురుగదాస్ రూపొందించిన 7ఎఎం అరివు చిత్రం తెలుగులో సెవెన్త్ సెన్స్ పేరుతో విడుదలైంది. ఈ చిత్రానికి ఉదయనిధి స్టాలిన్ నిర్మాత. హారిష్ జయరాజ్ సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











