ఇండియన్ ప్రియుడు దొరకలేదా?.. అందుకేనా విదేశీ భర్త.. శృతిహాసన్‌కు నెటిజన్ల ఝలక్!
అందాల తార శృతిహాసన్ సినిమా రంగాన్ని వదిలేసినట్టే కనిపిస్తున్నది. ప్రస్తుతం తమిళ టెలివిజన్‌లో హోస్ట్‌గా వ్యవహరించడం తప్పితే పెద్దగా చేస్తున్నదేమీ లేదు. కానీ ఈ రోజుల్లో శృతి బిజీగానే కనిపిస్తున్నది. ఎందుకంటే లండన్ ప్రియుడు మైఖేల్ కోర్సలేతో బిజీగా గడుపుతుండటమే అందుకు కారణం. తాజాగా శృతిహాసన్ పోస్ట్ చేసిన ఫొటో, కామెంట్ వైరల్‌గా మారింది. అంతేకాకుండా శృతిహాసన్‌ను కొందరు నెటిజన్లు అసభ్య పదజాలంతో దూషించడం కూడా కనిపించింది. వివరాల్లోకి వెళితే..

మైఖేల్ కోర్సలేతో డేటింగ్
గత కొన్నేళ్లుగా శృతిహాసన్, మైఖేల్ కోర్సలే గాఢంగా డేటింగ్‌లో మునిగిపోయారు. వీలు చిక్కితే శృతి హాసన్ లండన్‌లో వాలిపోవడమో లేదా కోర్సలే ముంబైకి రావడమో జరుగుతున్నది. ఇటీవల లండన్‌లో శృతిహాసన్, కోర్సలే కలిసి చెట్టాపట్టాలేసుకోవడం మీడియా కంటపడింది.

లండన్ నుంచి ముంబై
ప్రస్తుతం మైఖేల్ కోర్సలే అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో ఓ ఈవెంట్‌లో తలమునకలై ఉన్నారు. త్వరలోనే మైఖేల్‌ను కలుసుకొనేందుకు శృతిహాసన్ లాస్ ఎంజెలెస్‌కు వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లాస్ ఎంజెలెస్ పిలుస్తున్నది. చాలా కాలం తర్వాత అబ్బాయిని కలుసుకోబోతున్నాను అని శృతిహాసన్ ఇన్స్‌టాగ్రామ్‌లో హాట్ కామెంట్ చేసింది.

ఈ అబ్బాయిని మిస్ అవుతున్నాను
మైఖేల్ కోర్సలేను ప్రేమగా కౌగిలించుకొని ఉన్న ఫొటోను శృతిహాసన్ పోస్టు చేసింది. నేను ఈ అబ్బాయిని మిస్ అవుతున్నాను. అని కామెంట్ పెట్టింది. ఇటీవల శృతి పోస్టు చేసిన ఫొటోకు భారీగా లైకులు, కామెంట్లు వచ్చాయి. దాదాపు 4 లైకులు వచ్చాయి. అయితే కొందరు నెటిజన్లు చేతికి పనిపెట్టి దారుణంగా కామెంట్లు చేశారు.

శృతిహాసన్‌కు నెటిజన్ల ఝలక్
భారతీయ మగాళ్లు ఆడవాళ్లను మోసం చేయడంలో ఆరితేరిన వాళ్లు. అందుకే సినీ తారలు విదేశీయులను భర్తలుగా ఎంచుకొంటున్నారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇదిలా ఉండగా మరో నెటిజన్ స్పందిస్తూ.. భారతీయుడు దొరకలేదా? ఎవడెవడితోనూ డేటింగ్ చేస్తున్నావు. నీలాంటి అమ్మాయిని మేము లైక్ చేయమని అన్నాడు.

తండ్రి కమల్‌తో కలిసి
ఈ వ్యవహారం పక్కన పడితే, శృతిహాసన్ బాలీవుడ్‌లో బెహన్ హోగి తేరీ అనే చిత్రంలో చివరిసారిగా కనిపించింది. సూర్యతో కలిసి తమిళంలో సింగం 3 చిత్రంలో నటించింది. తండ్రి కమల్ హాసన్‌తో కలిసి శభాష్ నాయుడు అనే చిత్రంలో నటించింది. కానీ ఆ షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











