శృతి హాసన్ : అపుడు గబ్బర్ సింగ్, ఇపుడు గబ్బర్?

తాజాగా అందుతున్న సమాచారం శృతి హాసన్ 'గబ్బర్' అనే హిందీ సినిమాలో ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఈచిత్రంలో ఆమె కన్‌ఫర్మ్ అయినట్లు సమాచారం. అంతకు ముందు ఈచిత్రానికి శ్రద్ధాకపూర్‌ను అనుకున్నారు. కానీ ఫైనల్ గా శృతిని ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తమిళంలో హిట్టయిన 'రమణ' సినిమాకు రీమేక్‌గా 'గబ్బర్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జనవరి 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి శ్రద్ధ కపూర్ కంటే ముందు శృతి హాసన్‌ను అడిగారట. అయితే అప్పుడు డేట్స్ విషయంలో సందిగ్ధత ఉండటంతో ఆమె స్పందించ లేదుని, ఇటీవల డేట్స్ అడ్జెస్ట్ అకావడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
నిర్మాతలతో అఫిషియల్‌గా అగ్రిమెంటు కుదిరిన తర్వాతే శృతి హాసన్ ఈ సినిమా గురించి స్పందించాలని నిర్ణయించుకుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఆమె ఇతర సినిమాల విషయానికొస్తే....చరణ్ తో నటించని 'ఎవడు' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో పాటు తెలుగులో అల్లు అర్జున్ సరసన 'రేస్ గుర్రం' చిత్రంలో నటిస్తోంది. వెల్ కం బ్యాక్ అనే మరో హిందీ చిత్రంలోనూ ఆమె నటిస్తోంది.


Click it and Unblock the Notifications











