twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షాకింగ్.. ప్రియుడితో శృతి హాసన్ బ్రేకప్.. మైఖెల్ కోర్సెల్ ఎమోషనల్‌గా!

    |

    Recommended Video

    Shruti Haasan Breaks Up With Boyfriend Michael Corsale || Filmibeat Telugu

    కమల్ హాసన్ వారసురాలిగా శృతి హాసన్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కెరీర్ ఆరంభంలో శృతి హాసన్ కు పెద్దగా కలసిరాలేదు. శృతి నటించిన చిత్రాలన్నీ పరాజయం చెందుతూ వచ్చాయి. ఆ తర్వాత గబ్బర్ సింగ్, శ్రీమంతుడు, రేసు గుర్రం లాంటి ఘనవిజయాలతో శృతి హాసన్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఇటీవల శృతి హాసన్ కు సరైన విజయం లేదు. కాటమరాయుడు తర్వాత శృతి హాసన్ నుంచి మరో చిత్రం రాలేదు. గత ఏడాది నుంచి శృతి హాసన్ తన ప్రేమ వ్యవహారాలతో వార్తల్లో నిలుస్తోంది. తాజాగా శృతి హాసన్ ప్రియుడు సోషల్ మీడియా ద్వారా సంచలన విషయాన్ని వెల్లడించాడు.

     లండన్ యువకుడితో

    లండన్ యువకుడితో

    శృతి హాసన్ గత కొంత కాలంగా లండన్ కు చెందిన మైఖెల్ కోర్సెల్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగిస్తోంది. ఆ మధ్యన ప్రియుడిని తన తల్లిదండ్రులు కమల్ హాసన్, సారికకు పరిచయం కూడా చేసింది. దీనితో శృతి హాసన్, మైఖేల్ త్వరలో వివాహం చేసుకోవడం ఖాయం అని అంతా భావించారు. లండన్ కు చెందిన మైఖేల్ థియేటర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నాడు. కమల్ హాసన్ విశ్వరూపం 2లో చిన్న పాత్రలో నటించాడు.

    స్నేహితుల ద్వారా

    స్నేహితుల ద్వారా

    శృతి హాసన్, మైఖేల్ మధ్య ఉమ్మడి స్నేహితుల ద్వారా పరిచయం ఏర్పడింది. క్రమంగా ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. తాజాగా మైఖేల్ సంచలన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. శృతి హాసన్, తనకు మధ్య బ్రేకప్ జరిగినట్లు మైఖేల్ ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది. తామిద్దరం విడిపోవడానికి గల కారణాలని మాత్రం మైఖేల్ ప్రకటించలేదు.

    రెండేళ్ల గ్యాప్.. మళ్ళీ మొదలు పెట్టిన శృతి హాసన్!రెండేళ్ల గ్యాప్.. మళ్ళీ మొదలు పెట్టిన శృతి హాసన్!

    వ్యతిరేక మార్గాల్లో

    వ్యతిరేక మార్గాల్లో

    అనుకోని పరిస్థితుల వలన మేమిద్దరం వ్యతిరేక మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తోంది. కాబట్టి మేమిద్దరం ఎవరి మార్గాల్లో వారు ప్రయాణించాలని నిర్ణయించుకున్నాం. కానీ శృతి హాసన్ కు నేను ఎప్పటికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటాను అంటూ మైఖేల్ శృతి హాసన్ తో కలసి ఉన్న ఫోటోని షేర్ చేశాడు. పలు ఇంటర్వ్యూలో పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా శృతి హాసన్ స్పందించేంది కాదు. తన ప్రేమకు తల్లి దండ్రు కూడా అంగీకారం తెలిపిన తర్వాత శృతి హాసన్ మైఖేల్ తో బ్రేకప్ చేసుకుంది.

     సినిమాకు గ్రీన్ సిగ్నల్

    సినిమాకు గ్రీన్ సిగ్నల్

    చాలా రోజుల తర్వాత శృతి హాసన్ ఇటీవల ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయ్ సేతుపతి సరసన నటించేందుకు శృతి హాసన్ ఒకే చెప్పింది. ఆ చిత్ర షూటింగ్ ఇటీవలే చెన్నైలో ప్రారంభమైంది. శృతి హాసన్ కు ప్రస్తుతం కొన్ని బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సౌత్ లో శృతి మునుపటి జోరుని అందుకుంటుందా లేదా అనేది తేలాలంటే కొంతకాలం ఎదురు చూడాల్సిందే.

    English summary
    Shruti Haasan and beau Michael Corsale part ways. After dating for a year, Shruti Haasan and her Italian boyfriend Michael Corsale have broken up
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X