twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పంచెకట్టులో శృతి హాసన్ విదేశీ ప్రియుడు, కమల్‌తో పెళ్లి వేడుకలో.. (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    Recommended Video

    ప్రియుడితో పబ్లిక్ గా తిరుగుతున్న శ్రుతి హాసన్

    హీరోయిన్ శృతి హాసన్ కొంతకాలంగా మైఖేల్ కోర్సల్ అనే విదేశీయుడితో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నరంటూ వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మైఖేల్‌ను ఇప్పటికే తన తల్లిదండ్రులు కమల్ హాసన్, సారికలకు పరిచయం చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది.

    తాజాగా శృతి హాసన్, మైఖేల్ కోర్సెల్ కలిసి చెన్నైలో జరిగిన నటుడు అధవ్, వినోదిని పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఈ వేడుకకు పంచెకట్టులో హాజరైన మైఖేల్.... కమల్ హాసన్‌తో కలిసి కనిపించడం గమనార్హం.

    పెళ్లికి సిద్ధమయ్యారా?

    పెళ్లికి సిద్ధమయ్యారా?

    మైఖేల్ కోర్సల్ కొన్ని రోజులుగా తన ప్రియురాలు శృతి హాసన్ తో కలిసి ఇండియాలోనే ఉంటున్నారు. ఇపుడు ఏకంగా తమిళ సాంప్రదాయ దుస్తువుల్లో శృతి హాసన్, కమల్ హాసన్‌తో కలిసి పెళ్లి వేడుకకు హాజరు కావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలని గుసగుసలు వినిపిస్తున్నాయి.

     కమల్ హాసన్ నుండి గ్నీన్ సిగ్నల్

    కమల్ హాసన్ నుండి గ్నీన్ సిగ్నల్

    నటుడు కమల్ హాసన్ చాలా అభ్యుదయ భావాలు కలిసిగిన వ్యక్తి అనే సంగతి తెలిసిందే. తన ఇద్దరు కూతుళ్లకు ప్రతి విషయంలో కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చిన ఆయన శృతి హాసన్ ప్రేమ, పెళ్లి విషయంలో కూడా నిర్ణయం ఆమెకే వదిలేశాడట.

     పర్సనల్ విషయాలు చెప్పను అంటున్న శృతి

    పర్సనల్ విషయాలు చెప్పను అంటున్న శృతి

    శృతి హాసన్, మైఖేల్ కోర్సల్ కు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. అయితే మైఖేల్ తో రిలేషన్ షిప్ గురించి మాట్లాడమంటే శృతి హాసన్ నో అంటోంది. తన పర్సనల్ లైఫ్ విషయాలు పంచుకోవడం ఇష్టం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తేల్చి చెప్పారు.

     శభాష్ నాయుడు మూవీలో

    శభాష్ నాయుడు మూవీలో

    ప్రస్తుతం శృతి హాసన్ శభాష్ నాయుడు సినిమాలో తండ్రి కమల్ హాసన్ తో కలిసి నటిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు, కథా రచయిత, హీరో కూడా కమల్ హాసనే. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    English summary
    Shruti Haasan attended the wedding of actor Aadhava and Vinodhinnie. The actress was accompanied to the function by her dad Kamal Haasan as well as her rumoured boyfriend Michael Corsale and looked stunning.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X