శ్రుతిహాసన్ ప్లాప్ చిత్రం కూడా హిందీలో రీమేక్
ధనుష్ హీరోగా ఆయన భార్య ఐశ్వర్య తెరకెక్కించిన చిత్రం '3'. అందులో హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటించింది. చిత్ర విడుదలకు ముందే 'వై దిస్ కొలవెరి డి' పాట సంచలనం సృష్టించటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో అత్యధిక కేంద్రాల్లో చిత్రం విడుదలైంది. వూహించిన ఫలితం దక్కలేదు. నటిగా శ్రుతిహాసన్ మంచి మార్కులు మాత్రం కొట్టేసింది.తెలుగులో సైతం ఈ చిత్రం మొదటి రోజే పెద్ద ప్లాప్ టాక్ తెచ్చుకుని చతికిలపడింది. రైట్స్ కొనుక్కున్న నిర్మాత నట్టికుమార్ ని నట్టేట ముంచేసింది.
'3'రిజల్ట్ విషయం ప్రక్కన పెడితే ఈ చిత్రంలో శృతిహాసన్ పాఠశాల విద్యార్థినిగా ఆమె హావభావాలు శభాష్ అనిపించాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు నిఖిల్ అద్వానీ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నాడు. హీరోయిన్‌గా అవకాశాన్ని శ్రుతిహాసన్‌కే ఇచ్చారు. ఇప్పటికే హిందీలో 'లక్' చిత్రంలో నటించింది శ్రుతి. ప్రస్తుతం 'రామయ్యా వస్తావయా'లో నటిస్తోంది. నువ్వు వస్తానంటే నే వద్దంటానా రీమేక్ 'రామయ్యా వస్తావయా'. ప్రభుదేవా ఆ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు. ఆమె తర్వాతి హిందీ చిత్రమిదే అంటున్నాయి సన్నిహిత వర్గాలు.
'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'... త్రిషకు టాలీవుడ్‌లో తిరుగులేని ఇమేజ్ తెచ్చిన చిత్రం. ఇప్పుడీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు ప్రభుదేవా. హీరోయిన్‌గా సమంతను ఫిక్స్ చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల సమంత ఈ సినిమా నుంచి తప్పుకుంది. 'గబ్బర్‌సింగ్' సక్సెస్‌తో క్లౌడ్ నైన్‌లో ఉన్న శ్రుతిహాసన్ దోసిట్లోకి వాలిపోయింది ఈ ప్రాజెక్ట్...
దర్శకుడుగా ప్రభుదేవా తొలి చిత్రం 'నువ్వొస్తానంటే నే నొద్దంటానా'. హీరోగా సిద్ధార్థ్, హీరోయిన్‌గా త్రిషకు సూపర్ ఇమేజ్‌ని తీసుకువచ్చిన సినిమా ఇది.ప్రముఖ నిర్మాత రమేశ్ తౌరానీ కుమారుడు గిరీష్‌ని హీరోగా ఎంపిక చేశాడు ప్రభుదేవా. హీరోయిన్‌గా సమంతను ఫిక్స్ చేశారు. అయితే అనారోగ్య కారణాల వల్ల సమంత తప్పుకోవడంతో ఆ లక్కీ ఛాన్స్ ఇప్పుడు శ్రుతిహాసన్‌కి దక్కింది.


Click it and Unblock the Notifications












