రామ్ చరణ్ చేతుల మీదుగా శృతిహాసన్ పుట్టిన రోజు(ఫొటోలతో)
హైదరాబాద్ : పవన్ తో చేసిన 'గబ్బర్ సింగ్' సక్సెస్ తో ఉషారుగా ఉంది శ్రుతి హాసన్. ఇప్పుడు 'ఎవడు'లో రామ్‌చరణ్‌తో కలిసి నటిస్తోంది. దిల్ రాజు నిర్మాత. శ్రుతి పుట్టిన రోజు వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో జరిగాయి. ఆమె 'ఎవడు' చిత్రీకరణలో పాల్గొంటోంది. ఆ సెట్లోనే చిత్ర బృందం నడుమ సందడిగా ఆ వేడుకల్ని నిర్వహించారు.
శ్రుతి కేక్ కట్ చేసి యూనిట్ సభ్యులకు తినిపించింది. చరణ్, దర్శకుడు వంశీ పైడిపల్లి, ఛాయాగ్రాహకుడు సి.రామ్‌ప్రసాద్ తదితరులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుక తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని శ్రుతి చెప్పుకొచ్చింది. ఇలాంటివారి మధ్య ఆరోగ్యకరమైన వాతావరణంలో ఈ వేడక జరగటం తనకు చాలా హ్యాపీగా ఉందంటోంది.
రామ్ చరణ్ తాజా చిత్రం 'ఎవడు' షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో ఆయన సరసన శృతి హాసన్, అమీజాక్సన్ జోడీలు. తొలుత ఈ చిత్రం కోసం సమంతను కథానాయికగా ఎంపికచేసి, ఆ తర్వాత ఆమెకు బదులుగా శ్రుతి హాసన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. ఇక

'ఎవడు' చిత్రంలో మొదట ఎంపిక చేసిన సమంతతో క్రియేటివ్ డిఫెరెన్సిస్ రావటంతో ఆమెను తీసేసి శృతిని తీసుకున్నారు దర్సకుడు వంశీ పైడిపల్లి. దాంతో సమంత తో ఇంతకుముందు షూట్ చేసిన వన్నీ శృతిపై రీ షూట్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

'ఎవడు' లో అల్లు అర్జున్, కాజల్ అతిథి పాత్రలు పోషిస్తుండటం ఓ విశేషం.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ ఇప్పటికే కొంతభాగం పూర్తిచేసుకోగా, ప్రస్తుతం రామ్ చరణ్, జయసుధ తదితరులు పాల్గొనగా, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది.

రామ్ చరణ్‌కు మరింత పేరు తెచ్చిపెట్టే స్క్రిప్టుతో ఈ చిత్రాన్ని మలచడం జరుగుతోందని దిల్ రాజు అంటున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని, చోటా కె.నాయుడు ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నారు.

దర్శకుడు చిత్రం గురించి మాట్లాడుతూ.. ''రామ్ చరణ్‌ని ఓ విభిన్నశైలిలో ఆవిష్కరించే చిత్రమిది. మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కథలో ప్రతి పాత్ర కీలకమే. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అలరిస్తాయని''అన్నారు.

డైలాగ్ కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో రామ్ చరణ్ కి విలన్ గా మారారు.

ప్రస్తుతం ప్రభుదేవా దర్శకత్వంలో నువ్వు వస్తానంటే..నే వద్దంటానా చిత్రం హిందీ రీమేక్ రామయ్యా వస్తావయ్యా లో శృతిహాసన్ చేస్తోంది. ఆమె జనవరి 4 నుంచి రామ్ చరణ్ తాజా చిత్రం ఎవడు షూటింగ్ లో పాల్గొటోంది.


Click it and Unblock the Notifications











