twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శృతి హాసన్‌ను వేధించేందుకే కేసు!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: శృతి హాసన్‌ను వేధించేందుకే పిక్చర్ హౌస్ మీడియా ఆమెపై కేసు దాఖలు చేసిందని ఆమె తరుపు న్యాయవాది న్యాయస్థానికి వివరించారు. ఆమె స్థానంలో నిర్మాతలు తమన్నాను కూడా తీసుకున్నారని, షూటింగ్ కూడా జరుగుతోందని...కేవలం ఆమెను వేధించేందుకే ఆమెపై కేసు వేసారని వాదించారు. పిక్చర్ హౌస్ మీడియా శ్రుతిహాసన్‌తో ఒప్పందం చేసుకోలేదు. అడ్వాన్స్ కింద రూ.10 లక్షలు చెల్లించాలని, కాల్షీట్ల కోసం నెలరోజుల ముందు సంప్రదించాలన్న షరతులను పాటించలేదు. అడ్వాన్స్ ఇవ్వకుండానే ఏప్రిల్ 2వ తేదీ నుంచి షూటింగ్‌కు రావాలని శ్రుతిహాసన్‌కు వెల్లడించారు. ఇతర సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉన్నందున ఆమెకు వీలుకాలేదు అని కోర్టుకు వివరించారు. తన క్లయింటుపై కొత్త సినిమాల్లో నటించేందుకు ఒప్పందాలు చేసుకోవద్దంటూ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోర్టును ఆమె తరుపు లాయర్ కోరారు. వాదనలు విన్న కోర్టు కేసును ఈ నెల 20కి వాదాయి వేసింది.

    Shruti Haasan case postponed to April 20
    కేసు పూర్తి వివరాలు...
    నాగార్జున-కార్తి నటిస్తున్నా చిత్రానికి శృతి హాసన్ తొలుతు సైన్ చేయడం, ఆ తర్వాత డేట్స్ ఎడ్జెస్ట్ కాక తప్పుకోవటంతో ఆమెతో కాంట్రాక్టు కుదుర్చుకున్న సంస్థ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. శృతి హాసన్ ఉన్నట్టుండి అర్ధాంతరంగా తప్పుకోడాన్ని అనైతిక చర్యగా, అన్ ప్రొఫిషనల్ వ్యవహారంగా పరిగణించినట్లు ఆ సంస్ద ప్రకటించింది. ఆమె షూటింగుకు రాక పోవడం వల్ల తమకు ఫైనాన్సియల్ లాస్, రిప్యుటేషన్ లాస్ అయిందని నిర్మాతలు ఆందోళన చేసింది. కోట్లాదిరూపాయల డబ్బు, రిప్యుటేషన్ పోవటంతో పాటు తమ సమయం కూడా చాలా వృధా అయిందని, దీనివలన బిజిగా ఉన్న మిగతా ఆర్టిస్టుల షెడ్యుల్ దెబ్బ తిని లాస్ చాలా ఉంటుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

    ఈ విషయమై హీరోయిన్ శృతి హాసన్ మీద కేసు వేసారు. ఈ నేపథ్యంలో.... శృతి హాసన్ కొత్త సినిమా ఒప్పుకోకూడదని, క్రిమినల్ ఇన్విస్టిగేషన్ చెయ్యమని చెన్నై కోర్టు ఆర్డర్ వేసిన సంగతి తెలిసిందే. పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ (హైదరబాద్,చెన్నై) వారు ఆమెపై సివిల్ మరియు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ జరుపమని కోర్టు కెక్కడంతో కోర్టు ఆదేశాల మేరకు కేసు విచారణ జరుగుతోంది.

    English summary
    Picturehouse Media, a leading media and entertainment house, has initiated legal proceedings against actress Shruti Haasan, who pulled out of its yet-untitled Tamil-Telugu bilingual project citing the issue of dates.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X