»   » ఎఫ్ఐఆర్: శృతి హాసన్‌పై దాడి చేసింది అశోక్

ఎఫ్ఐఆర్: శృతి హాసన్‌పై దాడి చేసింది అశోక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ శృతి హాసన్‌పై కొన్ని రోజుల క్రితం ముంబైలోని అపార్టుమెంటులో దాడి ప్రయత్నం జరిగిన సంగతి తెలిసిందే. అయితే శృతి హాసన్ అప్రమత్తంగా, సమస్ఫూర్తితో వ్యవహరించి తనపై దాడికి ప్రయత్నించిన దుండగుడు తన ఫ్లాట్లోకి ప్రవేశించకుండా అడ్డుకుని డోర్ లాక్ చేసుకుని తప్పించుకుంది.

ఈ ఘటనపై తాజాగా బాంద్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. శృతి హాసన్ ఫిర్యాదు మేరకే వారు ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. సిసిటీవీ పుజటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. విజిటర్స్ లిస్టులో అతని పేరు అశోక్ అని ఉంది. అయితే అది అతను చెప్పిన ఫేక్ నేమ్ అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనతో షాక్‌కు గురైన శృతి హాసన్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ సంఘటన మీడియా ద్వారా బయటకు పొక్కడంతో ఇతర సెలబ్రిటీలు, అభిమానులు ట్విట్టర్ ద్వారా ఆమెకు మెసేజ్‌లు పంపుతూ ఓదార్చే ప్రయత్నం చేసారు.

శృతి హాసన్‌పై దాడి ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. దాడికి ప్రయత్నించింది ఎవరు? ఏ కారణంతో దాడి జరిగింది అనే విషయమై వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. గతంలో అతను ఎప్పుడైనా ఆమెను కలిసాడా? ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు.

సదరు అజ్ఞాత వ్యక్తి గతంలో పలు సందర్భాల్లో సినిమా సెట్లలో ఆమెను కలిసినట్లు తెలుస్తోంది. శృతి హాసన్ ట్విట్టర్ ద్వారా ముంబైలోని అపార్టుమెంట్లో ఉన్నట్లు సదరు వ్యక్తి తెలుసుకున్నాడని సమాచారం. ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉండే శృతి హాసన్ తాను ఎక్కడ ఉన్నాననే విషయాలను ఎప్పటికప్పుడు తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తుండటం అలవాటు. ఈ అలవాటే ఇపుడు ఆమె కొంపముంచింది.

శృతి హాసన్ ప్రస్తుతం హిందీలో వెల్‌కం బ్యాక్ అనే చిత్రంలో నటిస్తోంది. ఈచిత్రానికి అనీస్ బజ్మీ దర్శకత్వం వహిస్తున్నారు. ఫిరోజ్ నదియద్వాలా నిర్మాత. వెల్ కం బ్యాక్ చిత్రంలో శృతి హాసన్‌తో పాటు జన్ అబ్రహం, నానా పాటేకర్, అనిల్ కపూర్, పరేస్ రావల్, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు.

English summary
A few days back, a fan of Shruti Haasan managed to come up to the door of her flat. While Shruti was able to save herself, the scary incident has shaken her up. Three days after the incident, she finally summed up the courage to file an FIR on Wednesday at Bandra police station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu