మొన్న మహేష్...నిన్న పవన్ ...ఇప్పుడు శృతి హాసన్
హైదరాబాద్ : అందంతోనే కాదు తన జాలి హృదయంతోనూ స్టార్స్ తమ అభిమానుల హృదయాలను దోస్తున్నారు. మేక్ ఎ విష్ ఫౌండేషన్ కోరిక మేరకు మొన్న మహేష్ తన అభిమానిని చూడటానికి వెళితే తర్వాత పవన్ సైతం శ్రీజ అనే పాప కోసం వెళ్లి కలిసాడు. ఇప్పుడు శృతి హాసన్ సైతం తన అభిమాని చివరి క్షణాల్లో ఉంటే ఆమెను వెళ్లి కలిసి ఆనందపరిచింది.
పూనెలో ఉంటున్న సీతల్ పవార్ అనే 17 సంవత్సరాల అమ్మాయి...కాన్సర్ తో బాధపడుతోంది. డాక్టర్లు ఇక ఎన్నో రోజులు బ్రతకదు ..తీసుకువెళ్లిపోండి అని ఇంటికి పంపేసారు. అప్పుడు మేకే విష్ ఫౌండేషన్ వారు ఆమె చివరి కోరిక తెలుసుకున్నారు. అది ఆమె అభిమాన హీరోయిన్ శృతి హాసన్ ని కలవటం. ఈ విషయం వెంటనే శృతి కి చేరవేసారు.

ముంబైలో యారా చిత్రం షూటింగ్ లో ఉన్న శృతి హాసన్ ..ఇమ్మిడియట్ గా ...పూనె కు వెళ్లి ఆమెను కలిసింది. అంతేకాక ..ఓ రోజంతా ఆమెతో గడిపింది. ఆమెతో సినిమాలు గురించి డిస్కస్ చేసింది. వెళ్లిపోయేటప్పుడు తను స్వయంగా ఓ లెటర్ రాసి ఇచ్చింది. తన హృదయం బాధతో నిండిపోయిందని ఆమె తనను కలిసిన మీడియాతో చెప్పింది.
మేక్ ఎ విష్ ఫౌండేషన్ గురించి చెప్పుకోవాలంటే...చావుతప్పని పరిస్థితుల్లోని చిన్నారుల ఆకాంక్షను తెలుసుకుని వాటిని నెరవేర్చేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. ఎలాంటి లాభా పేక్ష లేకుండా అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో గల ఫియోనిక్‌స నగరంలో ఈ సంస్థ ఏర్పాటైంది. 'ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల్లో ఇది విస్తరించింది. ప్రస్తుతం డేవిడ్ ఎ విలియమ్‌స అధ్యక్షుడిగా ఉన్న ఈ సంస్థ 1980లో మొదలైంది.
హైదరాబాద్ ..నగరంలోని గ్లోబల్, కేర్, గాంధీ, అపోలో, ఎంఎన్‌జే ప్రాంతీయ క్యాన్సర్ పరిశోధన కేంద్రం, ఇండో-అమెరికన్ హాస్పిటల్...ఇలా ప్రముఖ ఆస్పత్రులకు మేక్ ఎ విష్ వాలంటీర్లు వెళ్తారు. ప్రాణాంతక వ్యాధులతో చికిత్స పొందుతున్న పిల్లల వివరాలు తెలుసుకుంటారు. డాక్టర్ అనుమతితో ఆ పిల్లలను, వారి తల్లిదండ్రులను సంప్రదిస్తారు. చిన్నారుల కోరిక లు తెలుసుకుని వాటిని నెరవేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తారు.


Click it and Unblock the Notifications











