శృతి హాసన్ పెళ్లి అప్పుడే.. ప్రేమలో పడి అంతా నాశనం చేసుకుందా!
Recommended Video

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా చక్రం తిప్పుతున్న శృతి హాసన్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. శృతి హాసన్ చేతిలో ప్రస్తుతం అవకాశాలు అంతగా లేవు. దీనికి కారణం ఆమె ప్రేమ వ్యావహారమే అని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. శృతి హాసన్ లండన్ బాయ్ ఫ్రెండ్ తో గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. శృతి హాసన్ పెళ్లి ముహూర్తం కూడా ఖారైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో శృతి పెళ్లి కూతురు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రియుడితో చక్కర్లు
శృతి హాసన్ తన ప్రియుడితో పబ్లిక్ గానే తిరుగుతున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. పలు సందర్భాల్లో ప్రేమ కాదు, జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని బుకాయించింది.

ప్రియుడిని తల్లిదండ్రులకు పరిచయం
తన ప్రియుడు మైకేల్ కొర్సలే ని తన తండ్రి కమల్ హాసన్ కు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. తల్లి వద్ద కూడా ప్రేమకు అంగీకారం చెప్పించుకుంది. అప్పటినుంచి శృతి హాసన్ పెళ్లిపై వార్తలు వస్తూనే ఉన్నాయి.

కెరీర్ నాశనం అందుకేనా
శృతి హాసన్ సౌత్ లో కొద్దిరోజుల క్రితం వరకు క్రేజీ హీరోయిన్ గా కొనసాగేది. కానీ ప్రేమ లో పడ్డాక ఆమె అవకాశాలు తగ్గుముఖం పట్టాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. టాలీవుడ్ లో ముఖ్యంగా శృతి హాసన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా కొనసాగేది. ప్రియుడివైపు ధ్యాస పెరగడం వలన శృతి హాసన్ కెరీర్ నాశనం చేసుకుందని వార్తలు కామెంట్లు పడుతున్నాయి.

పెళ్లి అప్పుడేనా
శృతి హాసన్ ప్రస్తుతం తన ప్రియుడితో లైవ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. శృతి హాసన్ ఈ ఏడాది చివరిలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











