‘గబ్బర్ సింగ్’ హిట్‌తో బంపర్ ఆఫర్లు!
'గబ్బర్ సింగ్' చిత్రం సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన శృతి హాసన్‌కు ఆఫర్లే ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే ఆమెను హీరోయిన్‌గా తీసుకోవడానికి పలువరు దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తుండగా....ఇటు వ్యాపార, వాణిజ్య వర్గాలు కూడా శృతిపై ఇంట్రెస్టు చూపుతున్నారు. తమ షోరూంలను, ఉత్పత్తులను ఆమె చేతుల మీదుగా ఓపెన్ చేయించేందుకు పోటీ పడుతున్నారు.
ఈ మేరకు ఆమె నిన్న హైదరాబాద్‌లో ప్రీమియం జ్యువెల్లరీ షోరూంలతో పాటు, మార్కెట్లోకి కొత్తగా విడుదలైన స్మార్ట్ ఫోన్లను విడుదల చేశారు. ఇందుకు గాను ఆమెకు ఫ్యాన్సీ అమౌంట్ ముట్టిన్నట్లు తెలుస్తోంది. గతంలో శృతి హాసన్‌పై ఐరన్ లెగ్ అనే అపవాదు ఉండేది. అందుకే ఆమెతో ఓపెనింగులు, ఇనాగరేషన్లు గట్రా చేయించే వారు కాదు.
అయితే గబ్బర్ సింగ్ హిట్‌తో శృతి దశ ఒక్కసారిగా తిరిగి పోయింది. శృతి అడుగు పెడితే విజయం, లాభం తథ్యం అనే భావనకు వచ్చారు వ్యాపార వర్గాలు. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఇన్నేళ్ల తర్వాత శృతి ఆనంద క్షణాలను అనుభవిస్తోంది. మరి మున్ముందు అమ్మడు విజయ పరంపర ఎలా ఉంటుందో చూడాలి.
గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత శృతి హాసన్ నితిన్ సరసన నటించబోతోంది. ప్రముఖ నిర్మాత బెల్లకొండ సురేష్ నితిన్ హీరోగా సినిమా తీయాలని కొన్ని రోజులుగా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు తమిళ దర్శకుడు విజయ్ దర్శకత్వంలో నితిన్‌ను ఒప్పించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో నితిన్ సరసన 'శృతి హాసన్'ను హీరోయిన్‌గా ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొలవెరి 3 చిత్రానికి సంగీతం అందించిన అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











