»   »  తప్ప తాగి శృతి హాసన్‌ను వేధించారు, అభిమానిపై కేసు

తప్ప తాగి శృతి హాసన్‌ను వేధించారు, అభిమానిపై కేసు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: గత సంవత్సరం ఓ అగంతక వ్యక్తి శృతి హాసన్ ఉంటున్న అపార్టుమెంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుండి చాక చక్యంగా తప్పించుకుంది శృతి హాసన్. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. మద్యం సేవించిన అభిమాని ఒకరు ఆమె ఉంటున్న హోటల్ వద్దకు వచ్చి వేధింపులలకు పాల్పడ్డాడు. ఓ బాలీవుడ్ మూవీ షూటింగు నిమిత్తం డెహ్రడూన్ వెళ్లిన శృతి హాసన్ సమీపంలోని హోటల్‌లో స్టే చేసినపుడు ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసు విచారణ సాగుతోంది.

Shruti Haasan harassed by drunken fan, files case against him

శృతి హాసన్ సినిమాలకు సంబంధించిన విషయాల్లోకి వెళితే....మహేష్ బాబు తాజా చిత్రం 'ఆగడు' లో వీలైనన్ని సర్పైజ్ లు నింపటానికి ప్రయత్నిస్తున్న దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రంలో ఐటం సాంగ్‌‍కు శృతిహాసన్‌ను ఒప్పించారు. దీంతో పాటు ఆమె తమిళంలో 'పూజై', హిందీలో 'వెల్ కం బ్యాక్', 'గబ్బర్', 'యారా' చిత్రాల్లో నటిస్తోంది.

శృతి హాసన్ బాలీవుడ్ మూవీ 'డి-డే'లో హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్‌తో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శృతి హాసన్ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో కలిసి శృంగార భంగిమల్లో నటించడం అప్పట్లో ఓ సెన్సేషన్. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాత సురేష్ దూడల తెలుగు డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఈచిత్రాన్ని 'గెలుపు గుర్రం' పేరుతో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శృతి హాసన్ నటించడం, హాట్ హాట్ సీన్లు ఉండటంతో ఇక్కడ మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

English summary

 Actress Shruti Haasan, has reportedly filed a verbal complaint with Mussoorie police against a drunken fan. According to a leading daily, a Sirsa-based man repeatedly knocked on her hotel room's door after midnight in an inebriated condition, where she was staying for a shoot.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu