»   » 'ఆగడు' లో శ్రుతి హాసన్ సెక్సప్పీల్ (ఫొటో)

'ఆగడు' లో శ్రుతి హాసన్ సెక్సప్పీల్ (ఫొటో)

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్ : విడుదల తేదీ దగ్గరపడుతూండటంతో 'ఆగడు' టీమ్ రోజు రోజుకీ వేడి పెంచేస్తోంది. తాజాగా శ్రుతి హాసన్ ఈ సినిమాలో చేసిన ఐటం సాంగ్ ఎలా ఉండబోతోందనే చెప్పటానికి అన్నట్లు ఓ పోస్టర్ ని విడుదల చేసారు. జంక్షన్ లో అనే పాటలో శ్రుతి ఆడి పాడి అలరించనుంది. పక్కా మాస్ లుక్ తో శ్రుతి హాసన్ ఈ చిత్రంలో చేసే స్టెప్స్ సినిమాకు ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు చెప్తున్నారు.

    'ఆగడు' సినిమా కోసం శ్రుతి హాసన్ ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడుతోంది. ''తమన్‌ అందించిన మాస్‌ మసాలా గీతమిది. ఇందులో మహేష్‌, శ్రుతిహాసన్‌ స్టెప్పులు ప్రేక్షకులకు కిక్‌ ఇస్తాయి'' అంటున్నారు దర్శక,నిర్మాతలు. ఇక మహేశ్‌ జోడీగా తొలిసారి తమన్నా నటిస్తుండటం, శ్రుతిహాసన్‌ ఓ పాటలో మహేశ్‌తో స్టెప్పులేయడం అదనపు ఆకర్షణలు. ‘1.. నేనొక్కడినే' సినిమాతో నటునిగా అందరి ప్రశంసలు పొందినా, వాణిజ్యపరంగా చేదు అనుభవాన్ని చూసిన మహేశ్‌ ఈ సినిమాతో తన బాక్సాఫీస్‌ స్టామినాని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.

    Shruti Haasan in Aagadu item song!

    మహేష్‌బాబు మాట్లాడుతూ... ''నా సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పిన చిత్రం 'దూకుడు'. ఆ సెట్‌లో ఉన్నప్పుడే 'ఆగడు' పేరుతో మరొక సినిమా చేయాలనుకొన్నాం. ఇందులో నేను కనిపించే విధానం, సంభాషణలు చెప్పే తీరు కొత్తగా ఉంటాయి. నటుడిగా నాకు మరో కీలకమైన మలుపు అవుతుంది'' అన్నారు

    ''మహేష్‌ని 'దూకుడు'లో పదిశాతం మాత్రమే చూశారు. ఇందులో వందశాతం చూస్తారు. అభిమానులు కూడా ఆశ్చర్యపోయేలా ఆయన తెరపై కనిపించబోతున్నాడు'' అన్నారు శ్రీనువైట్ల. మహేశ్‌ చెప్పిన ‘డిక్కీ బలిసిన కోడి చికెన్‌ షాప్‌ ముందుకొచ్చి తొడకొట్టిందంట', ‘అయినా నువ్వు డైలాగ్‌ వేస్తే కౌంటర్‌ వెయ్యడానికి నేను రైటర్‌ని కాదు ఫైటర్‌ని, అయ్యబాబోయ్‌ నాకు సినిమా డైలాగులు వొచ్చేస్తన్నాయేంటి' డైలాగులకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త టీజర్‌తో ‘ఆగడు' సినిమా ఎలా ఉండబోతోందో డైరెక్టర్‌ శ్రీను వైట్ల ఒక ‘ఫీలర్‌' వదిలారని వారంటున్నారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా మహేశ్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 19 న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.


    డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    Here is the still from 'Aagadu'. 'Junction Lo…' is going to be mother of all Item Songs.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more