»   » ఫీలవ్వట్లేదు, దర్శకుడినే అడగండి: శృతి ‘శ్రీమంతుడు’ ఇంటర్వ్యూ

ఫీలవ్వట్లేదు, దర్శకుడినే అడగండి: శృతి ‘శ్రీమంతుడు’ ఇంటర్వ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీమంతుడు' ఆగస్టు 7న ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే మహేష్ బాబుతో పాటు, దర్శకుడు కొరటాల శివ సినిమా విషయమై మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. తాజాగా శృతి హాసస్ శుక్రవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు, ఇతర విషాయలు మీడియాతో పంచుకున్నారు.

Shruti Haasan

శ్రీమంతుడు సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ...
ఈ సినిమాలో నేను చారుశీల అనే పాత్రలో నటించాను. స్వతంత్రంగా ఆలోచించే ఉన్నత భావాలు ఉన్న తెలివైన అమ్మాయి పాత్ర. నాకు బాగా నచ్చిన పాత్ర ఇది. నేను ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది.


మహేష్ బాబు గురించి మాట్లాడుతూ...
మహేష్‌తో సినిమా చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఇటీవల ఆగడులో ఒక ప్రత్యేక గీతంలో కనిపించాను. ఇపుడ హీరోయిన్ గా నటించడం హ్యాపీగా ఉంది. మహేష్‌లో నేను పెద్ద స్టార్‌ని అన్న భావన ఎక్కడా కనిపించదు. సెట్‌లో ఫ్రెండ్లీగా ఉంటారు. అందువల్లే ఆయన ఈ రోజు ఈ స్థాయిలో వున్నారు.


మహేష్‌బాబు అందం మిమ్మల్ని డామినేట్ చేస్తున్నట్టు ఏమైనా ఫీలయ్యారా? అనే ప్రశ్నకు శృతి హాసన్ స్పందిస్తూ...మహేష్ మంచి అందగాడే, ఫీలవ్వడానికి ఇవేమీ మిస్ ఇండియా పోటీలు కాదు, సినిమా...అంటూ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు.


శ్రీమంతుడులో నచ్చిన పాట గురించి చెబుతూ...ఈ ఆల్బమ్‌లో జత కలిసే.. అంటూ సాగే పాటంటే నాకు చాలా ఇష్టం. ఈ పాటను చిత్రీకరించిన తీరు కూడా నన్నెంతగానో ఆకట్టుకుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కొత్తగా చిత్రీకరించారు అన్నారు.


శ్రీమంతుడు సినిమా టీంతో పని చేయడంపై...
శ్రీమంతుడులో నాకు అవకాశం దక్కడం చాలా ఆనందంగా వుంది. చాలా రోజుల తరువాత ఓ గ్రేట్ టీమ్‌తో పని చేసాను. కొరటాల శివ సెన్సిబుల్ డైరెక్టర్. అందరితో ఈజీగా కమ్యూనికేట్ చేస్తారు. సైలెంటుగా ఉంటూనే తనకు కావాల్సింది మావద్ద నుండి కూల్‌గా రాబట్టుకుంటారు అని చెప్పుకొచ్చారు.


తమిళ చిత్రం ‘పులి'లో విజయ్ తో కలిసి పాట పాడారు, ఈ సినిమాలో ఎందుకు పాడలేదు అంటూ అని మీడియా అడిగిన ప్రశ్నకు శృతి హాసన్ స్పందిస్తూ..ఆ విషయం దర్శకుడు కొరటాల శివను అడిగితే బాగుంటుంది అంటూ సమాధానం ఇచ్చారు.


నా నటనను మెచ్చుకుంటే చాలు...
గోల్డెన్ లెగ్, సిల్వర్ లెగ్ అంటూ పేర్లు పెట్టి పిలవకండి. ఇది జ్యువెల్లరీ ఇండస్ట్రీ కాదు. సినిమా ఇండస్ట్రీ. ప్రేక్షకులు నా నటనను మెచ్చుకుంటే అంతే చాలు అంటూ మీడియా వారు అడిగిన ఓ ప్రశ్నకు కాస్త అసహనం వ్యక్తం చేసారు శృతి హాసన్.


నాన్న ఇన్వాల్వ్ కారు...
నా సినిమాల విషయంలో నాన్న అస్సలు ఇన్‌వాల్వ్ కారు. ఎలాంటి సలహాలు ఇవ్వరు. నీ జీవితం నీ ఇష్టం అని మాత్రమే చెబుతారు. నాన్నగారు ఈ రోజు ఈ స్థాయిలో వున్నారంటే దానికి ఆయనపడ్డ కష్టమే కారణం. వారసత్వంతో మాలాంటి వారు సినిమాల్లోకి ఈజీగానే రావొచ్చు కానీ ఇక్కడ నిలదొక్కుకోవడం అన్నది మాత్రం మా టాలెంట్ మీదే ఆధారపడి వుంటుంది. కష్టపడితేనే ఫలితం ఉంటుంది అన్నారు.

English summary
Check out Shruti Haasan interview about Srimanthudu movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu