‘నన్నలా అన్న వారికి గబ్బర్ సింగే సమాధానం’
బాలీవుడ్ మూవీ 'లక్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన శృతి హాసన్‌కు పాపం లక్కు అస్సలు కలిసి రావడం లేదు. ఆమె చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాప్ అయ్యాయి. దీంతో ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడి పోయింది. అయితే పవర్ స్టార్ 'గబ్బర్ సింగ్' చిత్రం ద్వారా తొలి మెగా హిట్ అందుకున్న శృతి ఇప్పుడు విమర్శకులకు ధీటైన సమాధానం ఇస్తూ వాళ్ల నోరు మూయిస్తోంది.
తాజాగా ఆమె ఓ ఇంటర్వూలో స్పందిస్తూ.... నేను నటించిన సినిమాలు ప్లాప్ అవుతాయని విమర్శించిన వారికి గబ్బర్ సింగే సమాధానం. సినిమా హిట్ ప్లాపులు అనేవి కథ, కథనం, పెర్ఫార్మెన్స్ మీద ఆధార పడి ఉంటాయి అని స్పష్టం చేస్తోంది. గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా తనపై ఇంతకాలం జరిగిన ప్రచారం పటాపంచలైనందుకు ఆనందంగా ఉందని ఉబ్బి తబ్బిబ్బవుతోంది ఈ హాట్ బ్యూటీ.
హిందీ దబాంగ్ చిత్రం చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. దానికి రీమేక్‌గా గబ్బర్ సింగ్ చిత్రంలో లోకల్ ఫ్లేవర్ జోడించి దర్శకుడు హరీష్ శంకర్ చాలా బాగా తీర్చి దిద్దాడు. ఈచిత్రంలో నేను చేసిన భాగ్యలక్ష్మి పాత్రకు మంచి రెస్సాన్ప్ వస్తోంది. పవన్ కళ్యాణ్ పవర్ ఏమిటో నాకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అర్థమైంది అంటూ తనమనసులోని మాటను బయట పెట్టింది.
ఈచిత్రంపై మీ నాన్న కమల్ హాసన్ ఎలా స్పందించారు అనే ప్రశ్నకు శృతి స్పందిస్తూ.... ఆయన విదేశాల్లో ఉన్నారు. విశ్వరూపం షూటింగులో బిజీగా గడుపుతున్నారు. తన కెరీర్లో తొలి పెద్ద హిట్ రావడంపై చాలా ఆనందం వ్యక్తం చేశారు అని సమాధానం ఇచ్చింది శృతి.


Click it and Unblock the Notifications











