సహజీవనంపై శృతిహాసన్ క్లారిటీ.. ప్రియుడికి సారీ..
అందాల తార శృతిహాసన్ ప్రేమలో పడినట్టు, ఓ విదేశీయుడితో అఫైర్ నడుపుతున్నట్టు మీడియాలో వార్తలు షికారు చేశాయి. అయితే ఆ వార్తలపై శృతి నేరుగా స్పందించిన దాఖలాలు లేవు. అంతేకాకుండా నా వ్యక్తిగత విషయాలను పంచుకోవాల్సిన అవసరం కూడా లేదని ఆమె పలుమార్లు వెల్లడించారు. అయితే తాజాగా తన రిలేషన్‌షిప్ గురించి శృతిహాసన్క్లారిటీ ఇచ్చారు. అదేంటో మీరే చూడండి..

మైఖేల్ కోర్సలేతో డేటింగ్
గత కొద్దిరోజులుగా శృతిహాసన్ లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్ట్ మైఖేల్ కోర్సలేతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. వారిద్దరూ అన్యోన్యంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముంబై ఎయిర్‌పోర్టులో వారిద్దరూ కలుసుకొని ముద్దులు పెట్టుకొంటున్న ఫొటోలు చర్చనీయాంశమయ్యాయి.

ప్రియుడితో కలిసి పెళ్లికి
కొద్దిరోజుల క్రితం చెన్నైలో జరిగి ఓ వివాహానికి తండ్రి కమల్ హాసన్‌తో కలిస కోర్సలే, శృతిహాసన్ హాజరుకావడం మీడియాలో హల్‌చల్ చేసింది. కోర్సలే హిందూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించి ఆకట్టుకొన్నాడు. ఆ సందర్భంగా శృతికి పెళ్లి జరిగినట్టు వార్తలు కూడా వెలువడ్డాయి.
Recommended Video


వైరల్‌గా మారిన శృతి పోస్ట్
ఇలాంటి వార్తల నేపథ్యంలో తన అఫైర్ గురించి క్లారిటీ ఇచ్చేసింది. కోర్సలే బర్త్ డే సందర్భంగా ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టింది. శృతిపెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నా పార్ట్‌నర్, బెస్ట్ ఫ్రెండ్ అంటూ
నేను చేసే ప్రతీ నేరంలో వెంట నిలిచే నా బెస్ట్ ఫ్రెండ్, పార్ట్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆర్ట్ వరల్డ్‌లో నాతో అండగా నిలవడమే కాదు.. నాతో జీవిత ప్రయాణం కూడా చేస్తాడు. నా సంతోషంలో భాగమవుతాడు అని పేర్కొన్నది.
నీతో లేనందుకు బాధగా
నీ జీవితంలో గొప్ప క్షణాలు ఆస్వాదించే సమయంలో నేను నీ పక్కన లేకపోవడం బాధగా ఉంది. అందుకు నేను క్షమాపణ చెబుతున్నాను. బంగారం లాంటి వాడివి అంటూ శృతిహాసన్ ట్యాగ్ చేసింది.

సెలబ్రిటీల ట్వీట్ల అభినందన
శృతిహాసన్ పోస్టుకు అనూహ్య స్పందన లభించింది. సమంత అక్కినేని, కత్రినాకైఫ్, ప్రియా ప్రకాశ్ వారియర్, షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తదితరలు ట్వీట్ చేసి మైఖేల్‌ను అభినందించారు. అభిమానుల నుంచి గ్రీటింగ్ వెల్లువెత్తాయి.

సినిమాలకు దూరంగా శృతి
ప్రస్తుతం శృతిహాసన్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తండ్రి కమల్ రూపొందించే శభాష్ నాయుడు సినిమా తప్పా చేతిలో మరో చిత్రం లేదు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్న కారణంగానే ఆమె సినిమాలపై ఆసక్తి చూపించడం లేదనే వాదన వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











