»   » సొంతగా నిర్మాణ సంస్థ స్థాపించిన శృతి హాసన్

సొంతగా నిర్మాణ సంస్థ స్థాపించిన శృతి హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటు సౌత్ సినిమాలతో పాటు అటు బాలీవుడ్లోనూ వరుస సినిమాలతో దూసుకెలుతున్న హీరోయిన్ శృతి హాసన్ కూడా సినీ నిర్మాణ రంగంలోకి ఎంటరయింది. సొంతగా ప్రొడక్షన్ హౌస్ స్థాపించింది. నిర్మాణ సంస్థ పేరు ‘ISIDRO'.

ఈ నిర్మాణ సంస్థను స్థాపించిన శృతి హాసన్ షార్ట్ ఫిల్మ్స్, యానిమేషన్, మ్యూజికల్, డిజిటల్, మల్టీమీడియా కంటెంట్ మీద ప్రధానంగా దృష్టి సారించనుంది. క్రమ క్రమంగా తన నిర్మాణ సంస్థను డెవలప్ చేసి భవిష్యత్తులో పూర్తి స్థాయి సినిమా నిర్మాణంపై దృష్టిసారించనుందని తెలుస్తోంది.


శృతి హాసన్ పూర్తి పేరు శృతి రాజ్యలక్ష్మి హాసన్. ప్రముఖ నటుడు కమల్ హాసన్, సారిక దంపతులకు జనవరి 28, 1986లో జన్మించింది. ఆమె కేవలం నటి మాత్రమే కాదు...మంచి సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా. కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది.


Shruti Haasan launches her production house

బాలీవుడ్ మూవీ ‘లక్' చిత్రం ద్వారా శృతి హాసన్ 2009లో హీరోయిన్‌గా కోరీర్ ప్రారంభించింది. అయితే తొలి చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలేవీ రాలేదు. ఆ తర్వాత 2011లో ‘అనగనగా ధీరుడు' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.


మొదట చేసిన 7 సినిమాలకు శృతి హాసన్‌కు కలిసిరాలేదు. 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా తొలి విజయం రుచి చూసింది. ఆ తర్వాత ఆమె పలు సినిమాలతో బిజీ అయింది.


నా సినిమాల విషయంలో నాన్న అస్సలు ఇన్‌వాల్వ్ కారు. ఎలాంటి సలహాలు ఇవ్వరు. నీ జీవితం నీ ఇష్టం అని మాత్రమే చెబుతారు. నాన్నగారు ఈ రోజు ఈ స్థాయిలో వున్నారంటే దానికి ఆయనపడ్డ కష్టమే కారణం. వారసత్వంతో మాలాంటి వారు సినిమాల్లోకి ఈజీగానే రావొచ్చు కానీ ఇక్కడ నిలదొక్కుకోవడం అన్నది మాత్రం మా టాలెంట్ మీదే ఆధారపడి వుంటుంది. కష్టపడితేనే ఫలితం ఉంటుంది అంటోంది శృతి హాసన్.

English summary
Shruti has now ventured into production with her newly launched label, ISIDRO. Through her production company, Shruti plans to foray into short films, animation, musical, digital and multimedia content.
Please Wait while comments are loading...