బిజినెస్ ఎత్తుగడ : పడుకొనె స్థానంలో శృతి హాసన్!
వ్యాపార వర్గాల ఎత్తుగడలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. తమ బిజినెస్ పెంచుకోవడానికి సినీ తారలతో ప్రచారం చేయిస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరు లీడింగులో ఉంటే వారిని తీసుకుంటూ ప్రచారాల మోత మోగిస్తారు. తాజాగా ప్రముఖ సారీ బ్రాండ్ కళాంజలి తన బ్రాండ్ అంబాసిడర్ గా శృతి హాసన్ ను నియమించుకుంది.
శృతి హాసన్ గబ్బర్ సింగ్ హిట్ తో టాప్ రేంజికి వెళ్లడంతో...గత కొన్ని రోజులుగా కళాంజలి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న దీపిక పడుకొనెను పక్కన పెట్టి ఆమె స్థానంలోకి శృతి హాసన్ ను తీసుకు వచ్చారు. శృతి హాసన్ ఇప్పటికే ఓ ఐస్ క్రీం బ్రాండ్ తో పాటు హోం అప్లియన్సెస్ కంపెనీ ప్రచారం చేస్తోంది. కళాంజలి ఆమె మూడో కమర్షియల్ డీల్.
గబ్బర్ విజయం తర్వాత శృతి హాసన్ రెండు సినిమాలకు ఓకే చేసింది. రవితేజ హీరోగా వస్తున్న 'బలుపు' చిత్రంతో పాటు....దర్శకుడు ప్రభుదేవా రూపొందించబోతున్న ఇంకా పేరు పెట్టని బాలీవుడ్ మూవీలో నటించబోతోంది. బలుపు చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా, ప్రభుదేవా తీయబోయే చిత్రం తెలుగులో హిట్టయిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రానికి రీమేక్ అని తెలుస్తోంది.
అల్లు అర్జున్ పూరీ జగన్నాధ్ 'ఇద్దరమ్మాయిలతో' టైటిల్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో శృతిహాసన్ హీరోయిన్ అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆమె చేయటం లేదని వినపడుతోంది. ఆమె సున్నితంగా ఈ ఆఫర్ ని తిరస్కరించినట్లు సమాచారం. ఈ మేరకు ఆమె...తాను బన్నీ,పూరీ వంటి గ్రేట్ పీపుల్ తో పని చేయలేకపోతున్నందుకు బాదపడుతున్నానంటూ చెప్పిందని కోలివుడ్ టాక్.


Click it and Unblock the Notifications











