‘విశ్వరూపం’ వివాదం...శృతి హాసన్ నోటికి తాళం!
హైదరాబాద్ : ఓ వైపు 'విశ్వరూపం' చిత్రం తమిళనాడు ప్రభుత్వం నిషేదం విధించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సినీతారలు కమల్ హాసన్‌కు మద్దతుగా నిలుస్తూ....తమిళనాడు ప్రభుత్వ చర్యను ఎండగడుతున్న సంగతి తెలిసిందే. సినిమాలో వివాదాస్పద అంశాలు ఏమీ లేకున్నా కావాలని రాజకీయం చేస్తున్నరని చాలా మంది అంటున్నారు.
అయితే కమల్ హాసన్ కూతురు శృతి హాసన్ మాత్రం ఈ విషయంలో తన నోటికి తాళం వేసుకుని కూర్చుంది. తను ఏం మాట్లాడితే ఆ వ్యాఖ్యలు ఏ విధంగా మలుపుతిరుగుతాయోనని ఆమె భయంగా కనిపిస్తోంది. అందుకే ఈ వివాదంపై ఆమె ఎలాంటి స్పందన కనబర్చడం లేదు. విశ్వరూపం చిత్రం వ్యవహారం కోర్టులో ఉన్నది కనుక దీని గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దనీ, ఇంటర్య్వూలు, కామెంట్లు ఇవ్వవద్దని ఆమె అంటోంది. అదే విధంగా తన తండ్రికి మద్దతుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపింది.
శృతి హాసన్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఎవడు' చిత్రం షూటింగులో పాల్గొంటోంది. రెండు రోజుల క్రితం ఆమె పుట్టిన రోజు వేడుకలను కూడా 'ఎవడు' చిత్రం యూనిట్ సభ్యుల సమక్షంలో జరుపుకుంది. ఈ చిత్రం తో పాటు రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న 'బలుపు' చిత్రం లో శృతి నటిస్తోంది.
విశ్వరూపం చిత్రం ఈ నెల 25న విడుదల కావాల్సి ఉండగా..... ముస్లిం సంఘాల ఫిర్యాదుతో తమిళనాడు ప్రభుత్వం ఆచిత్రంపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. తమిళనాడు మినహా దాదాపు అన్ని చోట్లా ఈచిత్రం విడుదలైంది. తమిళనాడులో ఆ పరిస్థితికి కారణం ముఖ్యమంత్రి జయలలిత కమల్ హాసన్ పై కక్ష సాధింపు చర్యలకు దిగడమే అనే విమర్శలు వినిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











