»   » మరోసారి సెక్సీగా రెచ్చిపోయిన శృతి హాసన్ (ఫోటోలు)

మరోసారి సెక్సీగా రెచ్చిపోయిన శృతి హాసన్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది.

కొద్ది రోజుల క్రితం కామసూత్ర భంగిమతో అలజడి రేపిన శృతిహాసన్ ..తను ఎలాంటి ఎక్సపోజింగ్ కైనా రెడీ అన్నట్లు సంకేతాలు వదిలింది. గబ్బర్ సింగ్ వరకూ తెలుగులో సరైన హిట్టులేని శృతిహాసన్‌ ఆ సినిమా హిట్ కావడంతో అందరికీ గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి.

'డాడీ పేరు సినిమా రంగంలో ఎప్పుడూ వాడుకోలేదు. కమల్‌ కూతురు అని ఎవరూ నాకు పనిగట్టుకొని అవకాశాలూ ఇచ్చేయలేదు. కానీ నాలో నటనకు, సంగీతానికి... సినిమా అంటే ప్రేమ పెరగడానికి బీజం వేసింది మాత్రం డాడీనే. సినిమా అంటే వ్యామోహం ఆయన వల్లే కలిగింది' అంటోంది శృతిహాసన్.

తాజాగా శృతి హాసన్ ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చి కుర్రకారు మతి పోగొట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

శృతి హాసన్

శృతి హాసన్


శృతి హాసన్ పూర్తి పేరు శృతి రాజ్యలక్ష్మి హాసన్. ప్రముఖ నటుడు కమల్ హాసన్, సారిక దంపతులకు జనవరి 28, 1986లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 27. ఆమె కేవలం నటి మాత్రమే కాదు...మంచి సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా.

తెరంగ్రేటం

తెరంగ్రేటం


బాలీవుడ్ మూవీ ‘లక్' చిత్రం ద్వారా శృతి హాసన్ 2009లో హీరోయిన్‌గా కోరీర్ ప్రారంభించింది. అయితే తొలి చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలేవీ రాలేదు. ఆ తర్వాత 2011లో ‘అనగనగా ధీరుడు' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

గబ్బర్ సింగ్‌తో దశ తిరిగింది

గబ్బర్ సింగ్‌తో దశ తిరిగింది


కారణం ఏమిటో తెలియదు కానీ మొదట చేసిన 7 సినిమాలకు శృతి హాసన్‌కు కలిసిరాలేదు. 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా తొలి విజయం రుచి చూసింది. ఆ తర్వాత ఆమె పలు సినిమాలతో బిజీ అయింది.

తెలుగు చిత్రాలు

తెలుగు చిత్రాలు


ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో నటించి ‘ఎవడు' చిత్రం ఇటీవల విడుదలైన బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించింది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన రేస్ గుర్రం చిత్రంలోనూ నటిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో రాబోయే చిత్రంలో మహేష్ బాబు సరసన అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

బాలీవుడ్ ప్రాజెక్టులు

బాలీవుడ్ ప్రాజెక్టులు


మరో వైపు బాలీవుడ్ లోనూ శృతి హాసన్ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె వెల్ కం బ్యాక్, గబ్బర్ చిత్రాల్లోనూ నటించబోతోంది.

English summary
The cover of the February 2014 issue of FHM India Magazine featured actress Shruti Haasan, sporting a lace-black negligee with a black jacket. Looking unusually spectacular, Shruti adds energy to the FHM magazine cover.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu