»   » మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లను మించిన శృతి హాసన్

మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లను మించిన శృతి హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ శృతి హాసన్ ట్విట్టర్ ఫ్యాన్ ఫాలోయింగులో పెద్ద పెద్ద స్టార్ హీరోలను సైతం వెనక్కి నెట్టేసింది. తెలుగులో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్లతో పాటు అందరు హీరోలను మించి పోయింది. తన అందం, అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగును భారీగా పెంచుకుంది.

తెలుగు స్టార్లలో మహేష్ బాబు అత్యధికంగా 15 లక్షల ట్విట్టర్ ఫ్యాన్ ఫాలోవర్స్ కలిగి ఉన్నాడు. కానీ హీరోయిన్ శృతి హాసన్ ఏకంగా 30 లక్షల మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది. పవన్ కళ్యాణ్‌కు కేవలం 6 లక్షల మంది ఫాలోవర్స్ మాత్రమే ఉండటం గమనార్హం.

Shruti Haasan reaches three million followers on Twitter

కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసిన శృతి హాసన్ నటిగా పెర్ఫార్మెన్స్ పరంగా తనను తాను నిరూపించుకుంటూనే... అటు గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తోంది. అందం, అభినయం కలిస్తేనే సినిమా రంగంలో నిలకడగా రాణించగలం అనే విషయాన్ని ఆమె కెరీర్ తొలినాళ్లలోనే గ్రహించి అందుకు తగిన విధంగా అడుగులు వేస్తోంది.

శృతి కేవలం నటి మాత్రమే కాదు...మంచి సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా. కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది.

English summary
“Welcome Back” actress Shruti Haasan has reached the three million follower mark on the micro-blogging site Twitter. The 29-year-old actress thanked her fans on her Twitter account. “Thank you for my 3 million!!! I love you all to bits and pieces!!! Here’s to more love and laughter,” she tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu