»   » వైరల్ గా మారిన శృతిహాసన్ 'బిచ్' (వీడియో) అలా తిట్టడం వల్లే బాధకలిగి...

వైరల్ గా మారిన శృతిహాసన్ 'బిచ్' (వీడియో) అలా తిట్టడం వల్లే బాధకలిగి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అందంతో పాటు శృతిహాసన్ కి ధైర్యం కూడా ఎక్కువే. మొదటి నుంచీ కథలు.. కవితలు రాయడం అలవాటున్న శృతి వరసబెట్టి బాధ పెట్టిన సంఘటలన్నింటిని పేపర్ మీద పెట్టేసింది. దాన్ని 'బి ది బిఛ్‌' అంటూ ఒక వీడియో రూపంలోకి తెచ్చింది..

'నచ్చింది చేయడం.. నా బతుకు నేను బతకడమే మీకు బిఛ్‌లా కనిపిస్తే అలా పిలిపించుకోడానికి నాకేం ప్రాబ్లమ్ లేదు. నాకు నచ్చింది నేను చేయడమే బిఛ్‌.నచ్చిన బట్టలు వేసుకోవడం బిఛ్‌. నా ప్రేమ. నా తప్పులు. నా జీవితం. నా ఇష్టం అంటూ ఈ వీడియో ద్వారా మెసేజ్ ఇచ్చింది.

Shruti Haasan's "Be The Bitch" goes Viral

సాధారణంగా ఆడవారిని అమర్యాదకరంగా తిట్టడానికి బూతులా వాడే పదం 'బిచ్‌'. ఆ పదానికి సరికొత్త అర్థం చెబుతూ శృతి ఓ కవిత్వం రాయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

బిచ్ అనేముందు ఆలోచించండి

బిచ్ అనేముందు ఆలోచించండి

‘నచ్చినట్టు బతకడం.. నచ్చిన బట్టలు వేసుకోవడం ‘బిచ్‌' అయితే అలా పిలిపించుకోవడానికి నేను వెనుకాడను. కానీ ఎవరినైనా ‘బిచ్‌' అనే పిలిచేముందు ఆలోచించుకోండి అంటోంది శృతిహాసన్

బిచ్ కు ఇంత అర్దం ఉందా

బిచ్ కు ఇంత అర్దం ఉందా

సమాజానికి ఎదురునిలిచే టీచర్‌ ఓ ‘బిచ్‌'. పిల్లల కోసం నిద్రకు దూరమయ్యేది ‘బిచ్‌'. కలలను ధైర్యంగా సాకారం చేసుకునేది ఓ ‘బిచ్‌'' అంటూ ఆ పదానికి కొత్త అర్థాలు చెప్పింది. తన మీద రాయి వేస్తే ఎలా తప్పించుకోవాలో తెలుసని, కానీ అది తిరిగి విసిరిన వారికే తగలకుండా చూసుకోండని చెప్పింది.

మీకు రాయి తగలకుండా

మీకు రాయి తగలకుండా

ఇక రోజు వారి జీవితం లో లేడీస్ మీద వినిపించే కామెంట్స్ అన్నింటిని స్కౌట్ చేసి మరీ స్ట్రాంగ్ గా సమాధానం చెప్పింది. తన మీద రాయి వేస్తే దాన్నుంచి ఎలా తప్పించుకోవాలో తెలుసు... కానీ అది తిరిగి వేసినవారికి తగలకుండా చూసుకోండంటూ ఘాటుగా ఇచ్చిన మేసెజ్ కి అందరూ ఫిదా అయ్యారు.

ఎందుకిదంతా అంటే..

ఎందుకిదంతా అంటే..

'బి ది బిఛ్‌' అంటూ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కారణాలు కూడా చెప్పింది. ఓ సారి ముంబై సెంట్రల్ స్టేషన్లో శృతికి చేదు అనుభవం ఎదురైందట. పొరబాటున ఎదురుగా ఉన్న ఓ లేడీకి తగలడం.. సారీ చెప్పే లోపే ఆమె శృతిని బిఛ్‌ అంటూ అనకూడని మాట అనేయడం జరిగిందట.

హర్ట్ అయ్యే ఇదంతా

హర్ట్ అయ్యే ఇదంతా

ఆ పదానికి అర్థం తెలిసిన వాళ్లేవరూ అంత త్వరగా వాడరు. అలాంటిది ఓ మహిళ ఇంకో మహిళని అలా ఎలా తిడుతుందంటూ శృతి చాలా హర్ట్ అయిందట. అందుకే ఇలా రియాక్ట్ అయ్యిందట. ఈ వీడియో అప్‌లోడ్‌ చేసిన కొన్ని గంటల్లోనే లక్షమంది పైగా వీక్షించారు.

పవన్ సరసన

పవన్ సరసన

తెలుగులో ప్రస్తుతం శృతి హాసన్...పవన్ కళ్యాణ్ సరసన కాటమరాయుడు చిత్రం చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ లో నిన్నటి నుంచి పాల్గొంటోంది. గతంలో పవన్ సరసన ఆమె గబ్బర్ సింగ్ చిత్రం చేసింది. ఆ చిత్రం ఘన విజయం సాధించింది.

ప్రేమమ్ ఉషారులో ..

ప్రేమమ్ ఉషారులో ..

శృతిహాసన్ రీసెంట్ గా చేసిన ప్రేమమ్ మొన్న శుక్రవారం రిలీజయ్యి మంచి హిట్ టాక్ ని సంపాదించింది. ఈ నేపధ్యంలో ఆమె చాలా ఉత్సాహంగా ఉంది. వరస ప్రాజెక్టులతో చాలా బిజీగా ఉంది.

శభాష్ నాయుడులో..

శభాష్ నాయుడులో..

మరో ప్రక్కన శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ తో ఓ చిత్రం చేస్తోంది. శభాష్ నాయుడు టైటిల్ తో రూపొందే ఈ చిత్రం త్వరలో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో నిజ జీవితలోలాగానే తండ్రి, కూతుళ్లుగా కనిపించనున్నారు. కమల్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు.

English summary
Shruti Haasan just changed the way we look at the word "Bitch", forever, through her latest video done for YouTube.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu