లీకైంది : శృతిహాసన్...డాన్స్ రిహార్సల్స్(వీడియో)
హైదరాబాద్ : శృతిహాన్ బెస్ట్ డాన్సర్ అనే సంగతి తెలిసిందే. ఈమె ఓ పెద్ద అవార్డు ఫంక్షన్ కోసం ఇదిగో ఇలా డాన్స్ ప్రాక్టీస్ చేసింది. ఈ రిహాల్సల్స్ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగు,తమిళ సూపర్ హిట్ సాంగ్స్ కు ఆమె వేసిన స్టెప్స్ అందరినీ అలరిస్తున్నాయి. ఇది లీకై కొద్ది కాలమైనా ఈ మధ్యనే బాగా ప్రాచుర్యం పొందింది. మీరు ఈ వీడియో పై ఓ లుక్కేయండి మరి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక శృతి హాసన్ కెరీర్ గురించి చెప్పాలంటే...
కొత్త సినిమాలతో ఒప్పందాలు కుదుర్చుకోరాదంటూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సోమవారం సిటీ సివిల్ కోర్టు ఉపసంహరించడంతో సినీ నటి శ్రుతిహాసన్‌కు వూరట లభించింది. శ్రుతిహాసన్ తమతో ఒప్పందం చేసుకుని ఉల్లంఘనకు పాల్పడ్డారని పిక్చర్ హౌస్ మీడియా లిమిటెడ్ సంస్థ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై శ్రుతిహాసన్ కౌంటరు దాఖలు చేశారు.
తనను వేధించడానికే పిటిషన్‌లు దాఖలు చేశారని, తనకెలాంటి అడ్వాన్స్ ఇవ్వలేదని ఆమె తరఫు న్యాయవాది బి.చంద్రసేన్‌రెడ్డి కోర్టుకు నివేదించారు. వివాదాన్ని రాజీ మార్గంలో పరిష్కరించుకుంటామని, పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలంటూ పిక్చర్ హౌస్ మీడియా కోర్టుకు నివేదించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన 25వ అదనపు చీఫ్ జడ్జి సాంబశివరావు నాయుడు పిటిషన్‌ను కొట్టివేశారు.

''జయాపజయాల గురించి మాట్లాడటం, వాటి గురించి పదే పదే ఆలోచించడం నాకు అస్సలు నచ్చదు'' అంటోంది శ్రుతి హాసన్. ఫలితం ఎలాంటిదైనా అది మనసులో కాసేపే ఉండటం మేలంటోంది. దక్షిణాదిలో అగ్ర హీరోయిన్ గా రాణిస్తున్న శ్రుతి ప్రస్తుతం తెలుగులో మహేష్‌బాబు సరసన నటిస్తోంది. కమల్ తనయగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె తండ్రిలాగే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటుంది.
''నలుగురు నడిచిన దారిలో నడవడం నాకు ఇష్టముండదు. ఆ లక్షణమే నన్ను ప్రత్యేకంగా నిలబెడుతోంద''ని చెబుతోంది శ్రుతి. 'మీరు చేసిన ఓ సినిమా పరాజయాన్ని చవిచూస్తే ఆ ప్రభావం మీపై ఎంతకాలం ఉంటుంది?' అని అడిగితే ''ఒకరి ప్రతిభని ఎప్పుడూ సినిమాల ఫలితాలతో బేరీజు వేయకూడదు. సమష్టిగా కష్టపడితేనే సినిమా బయటికొస్తుంది. వాటి ఫలితాలు అందరికీ చెందుతాయి.
చిత్రంగా ఆ ప్రభావం హీరో,హీరోయిన్స్ లమీదే ఎక్కువగా కనిపిస్తుంటుంది. నేను మాత్రం నా సినిమా విజయం సాధించిందంటే దాన్ని అందరికీ పంచేస్తుంటా. పరాజయాన్ని చవిచూసినా సరే దాని గురించి అదే పనిగా ఆలోచించను'' అంటోంది. ''ఏం చేస్తే ఏమవుతుందో అని చాలామంది కొత్త ప్రయత్నాల జోలికి వెళ్లరు. నాకు మాత్రం అలాంటి భయాలేవీ లేవు'' అని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్.


Click it and Unblock the Notifications











