twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శృతిహాసన్ ఇలా రెచ్చిపోయిందేంటి? (ఫొటో)

    By Srikanya
    |

    ముంబై : సక్సెస్ ఇచ్చిన ఆనందం మరొకటి ఇవ్వదంటారు. ఆ మధ్య చాలా కాలం వరకూ ఐరన్ లెగ్ గా చెప్పుకోబడ్డ శృతి హాసన్...గబ్బర్ సింగ్ సక్సెస్ తో మళ్లీ పుంజుకుంది. ఆ ఉత్సాహంతో ఆమె వెండితెరపై రెచ్చిపోతోంది. హీరోయిన్ గానే కాక ఐటం గర్ల్ గా కూడా ఆమె తన దైన శైలిలో ఇరగతీస్తోంది. మీరు చూస్తున్న ఫొటో శృతి చేస్తున్న ఐటం సాంగ్ లోది.

    మహేష్ బాబు చిత్రం ఒక్కడు రీమేక్ తేవర్ లో ఆమె ఐటం సాంగ్ చేస్తోంది. బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆయన కుమారుడు అర్జున్ కపూర్ నటిస్తున్నారు. సోనాక్షి సిన్హా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రంలో మదామియా అంటూ శృతిహాసన్ ఈ రీతిలో అందాలు తెరపై ఒలకపోసింది. ఈ పాట సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా బాలీవుడ్ ఐటం సాంగ్ లలో ఒకటిగా ఉండిపోతుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

    Shruti Haasan's ITEM BOMB avatar!

    ఇక బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌.... తెర ఏదైనా అందాల అభినయానికి కేరాఫ్‌ అడ్రస్‌ శ్రుతిహాసన్‌. వరుస హిట్లూ, సినిమాలతో క్షణం తీరిక లేకుండా దూసుకెళుతున్న ఈ అమ్మడు సోనాక్షి నటిస్తున్న 'తేవర్‌'లో ఒక పాట పాడుతోంది. ఈ చిత్రం తెలుగులో వచ్చి హిట్టైన మహేష్ చిత్రం ఒక్కడుకి రీమేక్. అలాగే ఆమె ప్రస్తుతం మహేష్ చిత్రం ఆగడులో పాట పాడటం విశేషం. ఇలా మహేష్ తో లింక్ ఉన్న రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ అదరకొడ్తోంది.

    సహజంగానే గాయని అయిన శ్రుతి పాట ఈ సినిమాకు మంచి ప్రచారం కల్పిస్తుందని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. మరోవైపు బాలీవుడ్‌లో శ్రుతిహాసన్‌కు పోటీ ఉన్న హీరోయిన్లలో సోనాక్షి కూడా ఒకరు. అలాంటి హీరోయిన్‌ సినిమాలో పాడటం ద్వారా తనకు ఎవరితోనూ భేషజాలు లేవని శ్రుతి ప్రకటించుకుంది.

    ఒక హీరోయిన్‌ను చూస్తే మరొకరికి గిట్టదు. కొత్తతరం ముద్దుగుమ్మల్లో ఇది మరీ ఎక్కువ. ఇక బాలీవుడ్‌లో అయితే ముద్దుగుమ్మల మధ్య మాటల యుద్ధం బాహాటంగానే సాగుతుంటుంది. అలాంటిది ఓ హీరోయిన్‌ సినిమాకు మరో అందగత్తె పాటేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. హీరోయిన్ల మధ్య ఇలాంటి స్నేహపూర్వక వాతావరణం ఆహ్వానించదగ్గదే కదా అంటున్నాయి సినీ వర్గాలు.

    English summary
    
 
 First look of Shruti Haasan's item number in the Bollywood film 'Tevar' starring Arjun Kapoor and Sonakshi Sinha in lead roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X