»   » ఖరీదు ఎక్కువే: అపుడు మహేష్ బాబు, ఇపుడు శృతి హాసన్

ఖరీదు ఎక్కువే: అపుడు మహేష్ బాబు, ఇపుడు శృతి హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా తారల సంపాదన కోట్లలోనే ఉంటుంది. టాప్ హీరోలు, హీరోయిన్ల సంగతి...వారి సంపాదన గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆ రేంజిలో సంపాదన ఉన్న వారు లగ్జరీగా బ్రతకాలనుకోవడం సహజమే. ముఖ్యంగా వారి లైఫ్ స్టైల్ లో ఖరీదైన కార్లకు ప్రత్యేక స్థానం ఉంది.

తెలుగులో టాప్ స్టార్స్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్ తదితరులు తరచూ ఖరీదైన కార్లు కొంటూ హాట్ టాపిక్ అవుతుంటారు. ఆ మధ్య మహేష్ బాబు ఎంతో ముచ్చటపడి ఖరీదైన రేంజ్ రోవర్ కారు కొన్న సంగతి తెలిసిందే. ఖరీదు సుమారు 70 నుండి 80 లక్షలు.

Shruti Haasan's New Range Rover

తాజాగా హీరోయిన్ శృతి హాసన్ కూడా తాను ఎంతగానో మనసు పడ్డ ఖరీదైన రేంజ్ రోవర్ రెడ్ కలర్ కారును సొంతం చేసుకుంది. సంవత్సరం నుండి ఈ కారు కొనాలని ఆశ పడుతున్న శృతి.....తన తాజా సినిమా ‘గబ్బర్ ఈజ్ బ్యాక్' చిత్రం విజయాన్ని ఈ కారు కొని సెలబ్రేట్ చేసుకుంది.

గతంలో శృతి హాసన్ తన సంపాదనతో ముంబైలో ఓ లగ్జరీ ప్లాట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇపుడు కూడా తాను మనసు పడ్డ కారును తన సంపాదనతోనే కొనుగోలు చేసింది. ఈ ఏడాది శృతి హాసన్ తెలుగు, తమిళంతో పాటు హిందీలో 7 చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది.

English summary
Shruti Haasan happily posing with her brand new and expensive Range Rover SUV.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu