జూ ఎన్టీఆర్ కోసం... సమంత-శృతి హాసన్ సిగపట్లు!
హైదరాబాద్ : గబ్బర్ సింగ్ సక్సెస్ తర్వాత హీరోయిన్ శృతి హాసన్‌కు అవకాశాలు వరదలా వచ్చి పడుతున్నాయి. అయితే ఆమె మాత్రం సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఆమె తెలుగుగులో 'ఎవడు', 'బలుపు' చిత్రాలకు సైన్ చేసింది. తాజాగా శృతి జూ ఎన్టీఆర్ సినిమాలో ఖరారైంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రానికి దిల్ రాజు నిర్మాత.
గతంలో హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా శృతి హాసన్ కు మంచి బ్రేక్ ఇచ్చారు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ల జూ ఎన్టీఆర్ సినిమాకు రిపీట్ కావడం గమనార్హం. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు. ఇప్పటికే సమంతను మొదటి హీరోయిన్ గా ఎంపిక చేయగా, శృతి హాసన్ సెకండ్ హీరోయిన్ గా నటించనుంది. సినిమాలో ఈ ఇద్దరు భామల పాత్రలు జూ ఎన్టీఆర్ కోసం పోట్లాడుకునేలా ఉంటాయని టాక్.
తనకు ఈ సినిమాలో అవకాశం దక్కడంపై హీరోయిన్ శృతి హాసన్ ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ విషయమై తన ట్విట్టర్లో వ్యాఖ్యానిస్తూ....తారక్ సినిమాలో నటించడం ఎంతో ఆనందంగా ఉంది, హరీష్ శంకర్ కు స్పెషల్ థాంక్స్' అంటూ ట్వీట్ చేసింది. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ కాలేజీ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు.
ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, సంగీతం: తమన్, కూర్పు: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, సతీష్ వేగ్నేశ, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత దిల్ రాజు, కథ- మాటలు-దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











