»   » సెల్ఫీ షాట్స్... శృతి హాసన్ హడావుడి (ఫోటోలు)

సెల్ఫీ షాట్స్... శృతి హాసన్ హడావుడి (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య కాలంలో తమ మొబైల్ ఫోన్లతో సెల్ఫీ షాట్స్ తీసుకోవడం, సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేయడం సరికొత్త ట్రెండుగా మారిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ స్టార్లతో మొదలైన ఈ హడావుడి....బాలీవుడ్ల స్టార్స్, టాలీవుడ్ స్టార్ వరకు పాకింది. వారిని చూసి ఫ్యాన్స్ కూడా సెల్ఫీ షాట్ష్‌తో హడావుడి చేస్తున్నారు.

తాజాగా హీరోయిన్ శృతి హాసన్ కూడా సెల్ఫీ షాట్లతో హడావుడి చేసింది. వాటిని సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసింది. తన తండ్రి కమల్ హాసన్, తన అభిమాన హీరో షారుక్ ఖాన్, యార్ దర్శకుడు తిగ్మాంషులతో సెల్ఫీ ఫోటోలు దిగి తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో పోస్టు చేసి హడావుడి చేస్తోంది.

అందుకు సంబంధించిన ఫోటోలు శృతి హాసన్ గురించిన వివరాలు స్లైడ్ షోలో...

శృతి హాసన్

శృతి హాసన్


కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్.

స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది

స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది


సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది.

అందాల ఆరబోతలోనూ..

అందాల ఆరబోతలోనూ..


కొద్ది రోజుల క్రితం ‘డి-డే' సినిమాలో కామసూత్ర భంగిమతో అలజడి రేపిన శృతిహాసన్ ..తను ఎలాంటి ఎక్సపోజింగ్ కైనా రెడీ అన్నట్లు సంకేతాలు వదిలింది.

గబ్బర్ సింగ్ సినిమాతో...

గబ్బర్ సింగ్ సినిమాతో...


గబ్బర్ సింగ్ వరకూ తెలుగులో సరైన హిట్టులేని శృతిహాసన్‌ ఆ సినిమా హిట్ కావడంతో అందరికీ గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి.

డాడీ గురించి అలా...

డాడీ గురించి అలా...


'డాడీ పేరు సినిమా రంగంలో ఎప్పుడూ వాడుకోలేదు. కమల్‌ కూతురు అని ఎవరూ నాకు పనిగట్టుకొని అవకాశాలూ ఇచ్చేయలేదు. కానీ నాలో నటనకు, సంగీతానికి... సినిమా అంటే ప్రేమ పెరగడానికి బీజం వేసింది మాత్రం డాడీనే. సినిమా అంటే వ్యామోహం ఆయన వల్లే కలిగింది' అంటోంది శృతిహాసన్.

ఆమె పూర్తి పేరు

ఆమె పూర్తి పేరు


శృతి హాసన్ పూర్తి పేరు శృతి రాజ్యలక్ష్మి హాసన్. ప్రముఖ నటుడు కమల్ హాసన్, సారిక దంపతులకు జనవరి 28, 1986లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 27. ఆమె కేవలం నటి మాత్రమే కాదు...మంచి సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా.

తెరంగ్రేటం

తెరంగ్రేటం


బాలీవుడ్ మూవీ ‘లక్' చిత్రం ద్వారా శృతి హాసన్ 2009లో హీరోయిన్‌గా కోరీర్ ప్రారంభించింది. అయితే తొలి చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలేవీ రాలేదు. ఆ తర్వాత 2011లో ‘అనగనగా ధీరుడు' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

English summary

 Check out Shruti Haasan selfie photos. Shruti Rajalakshmi Haasan is an Indian actress, singer and musician who works in the South Indian film industries and Bollywood. Her parents are noted actors Kamal Haasan and Sarika.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu