నా జీవితంలో గౌతమి అనే మహిళే లేదు.. శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు, అతడు స్నేహితుడు మాత్రమే!

దాదాపు 13 ఏళ్ల సహజీవనం తరువాత కమల్ హాసన్, గౌతమి గత ఏడాది విడిపోయిన సంగతి తెలిసిందే. దీనిగురించి అనేక పుకార్లు అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో ఉన్నాయి. గౌతమి, శృతి హాసన్ మధ్య పొసగడం లేదని వార్తలు అప్పట్లో చక్కర్లు కొట్టాయి. శృతి హాసన్ తో ఉన్న విభేదాల కారణంగానే గౌతమి కమల్ నుంచి విడిపోయిందనే వార్తలు లేకపోలేదు. తాజగా ఓ ఇంటర్వ్యూ లో శృతి హాసన్ గౌతమి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్, వ్యక్తి గత జీవితం గురించి అనే విషయాలు వెల్లడించింది.

కమల్, గౌతమి విడిపోవడానికి కారణం

కమల్, గౌతమి విడిపోవడానికి కారణం

గౌతమి, కమల్ విడిపోవడానికి కారణం శృతి హాసన్ అనే వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించాలి అని ఇంటర్వ్యూ లో శృతిహాసన్ కు ప్రశ్న ఎదురైంది. నా జీవితంలో లేని వారి గురించి నేను ఏమని మాట్లాడాలి. గౌతమి అనే పేరుతో తన జీవితంలో ఎవరూ లేరని శృతి తెగేసి చెప్పింది.

రహస్యం ఏమీ లేదు

రహస్యం ఏమీ లేదు

మైఖేల్ కొర్సలే తో ఉన్న పరిచయం కేవలం స్నేహం మాత్రమే అని శృతి హాసన్ తెలిపింది. ఈ విషయంలో ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనని శృతి హాసన్ దాటవేసింది. శృతి హాసన్, మైఖేల్ మధ్య ప్రేమ సాగుతోందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

సమాధానం లేదు

సమాధానం లేదు

పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్నకు తనవద్ద సమాధానం లేదని శృతి హాసన్ తెలిపింది. తనకు మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని శృతి తెలిపింది. ఇందులో ఎలాంటి రహస్యాలు లేవని, ఏ విషయం అయినా దాచుకోకుండా వెల్లడిస్తానని శృతి హాసన్ తెలిపింది.

విశ్రాంతి తీసుకోవాలనిపించింది

విశ్రాంతి తీసుకోవాలనిపించింది

తాను తొమ్మిదేళ్ల పాటు సినిమాల్లో నటించానని, కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలనిపించిందని శృతి హాసన్ తెలిపింది. అందువలనే ఈ గ్యాప్ ఏర్పడింది. ప్రస్తుతం మళ్ళీ కథలు వింటున్నా. త్వరలోనే ఓ చిత్రానికి సంతకం చేస్తా అని శృతి హాసన్ తెలిపింది.

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన

రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన

కమల్ హాసన్ రాజకీయాల్లోకి ప్రవేశించి సొంతంగా పార్టీ స్థాపించారు. తండ్రి ఆహ్వానిస్తే రాజకీయాల్లోకి వెళతారా అనే ప్రశ్నకు శృతి హాసన్ స్పందించింది. అవగాహనా లేకుండా తాను రాజకీయాల్లోకి ప్రవేశించానని శృతి హాసన్ తెలిపింది. రాజకీయ అవగాహన పెరిగిన తరువాత ఈ విషయం గురించి ఆలోచిస్తానని శృతి హాసన్ తెలిపింది.

కాటమరాయుడు చివరి చిత్రం

కాటమరాయుడు చివరి చిత్రం

శృతి హాసన్ తెలుగులో నటించిన చివరి చిత్రం కాటంరాయుడు. పవన్ కళ్యాణ్ సరసన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. గ్యాప్ ఏర్పడడం వలన, కొన్ని తెలుగు పదాలు తాను మర్చిపోతున్నానని శృతి హాసన్ తెలిపింది. కానీ తెలుగు భాషని పూర్తిగా మరచిపోలేదని తెలిపింది. ఇటీవల కాలంలో తనకు నచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి అని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X