గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్.. అదిరిపోయే కెమిస్ట్రీతో..
గత కొద్దికాలంగా వెండితెరకు ముఖం చాటేసిన శృతిహాసన్ ఇప్పుడిప్పుడే సినిమాల్లో నటించడానికి ఉత్సాహం చూపుతున్నారు. తమిళంలో సింగం 3 తర్వాత కమర్షియల్ సినిమాల్లో నటించిన దాఖలాలు లేవు. అయితే తెలుగులో మరోసారి గబ్బర్ సింగ్ మూవీ కాంబినేషన్‌ను రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నది ఈ అందాల భామ.
Recommended Video

వకీల్ సాబ్‌గా పవన్ కల్యాణ్
రెండేళ్లకుపైగా పవన్ కల్యాణ్ సినిమాలకు దూరంగా ఉండి.. రాజకీయాలకే పరిమితమయ్యారు. కొన్ని పరిస్థితుల కారణాల వల్ల సినిమాలను అంగీకరించేందుకు సిద్దమయ్యారు. అలా సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన పవన్ కల్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్‌కు పచ్చ జెండా ఊపారు.

శృతిహాసన్ ఫైనలైజ్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు రూపొందిస్తున్న వకీల్ సాబ్ చిత్రానికి వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన పలువురు హీరోయిన్ల పేర్లను పరిశీలించి చివరకు శృతిహాసన్‌ను ఫైనల్ చేశారు. ఈ సినిమాలో నటించేందుకు కూడా శృతి అంగీకరించడంతో మళ్లీ తెర మీద గబ్బర్ సింగ్ కాంబినేషన్‌కు రంగం సిద్ధమైంది.

తమిళంలో విద్యాబాలన్.. తెలుగులో శృతి
తమిళంలో పింక్ రీమేక్ నేర్కొండ పార్వల్ చిత్రంలో అజిత్ సరసన విద్యాబాలన్ నటించింది. అదే పాత్రలో పవన్ కల్యాణ్‌కు జోడిగా శృతిహాసన్ నటించేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల తదితరులు నటిస్తున్నారు.

శృతిహాసన్ కెరీర్..
ఇక శృతిహాసన్ కెరీర్ విషయానికి వస్తే.. విజయ్ సేతుపతితో ఎస్పీ జననాథన్ దర్శకత్వం వహించే లాభం చిత్రంలో శృతిహాసన్ నటిస్తున్నది. ఇటీవల నటించిన దేవీ అనే షార్ట్‌ఫిలింకు మంచి పేరు వచ్చింది. ఇక పవన్ కల్యాణ్ మూడు నాలుగు చిత్రాలకు పచ్చ జెండా ఊపిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











