నిర్మాతగా మారుతున్న శృతి హాసన్
హీరోయిన్ శృతి హాసన్ నిర్మాతగా మారబోతోంది. చాలా రోజుల క్రితమే 'ఇసిడ్రో మీడియా' అనే బేనర్ స్థాపించిన చెన్నై బ్యూటీ డిజిటల్ మీడియాలో క్రియేటివ్ కంటెంట్ అందించడమే లక్ష్యంగా తన సంస్థను విస్తరించడానికి చాలా పెద్ద ప్లాన్సే వేసుకుంది. అయితే ఇప్పటి వరకు ఏ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు ఆమె బేనర్లో తొలి ప్రాజెక్టు రాబోతోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు జయప్రకాష్ రాధాకృష్ణన్ తర్వాతి మూవీ 'ది మస్కిటో ఫిలాసఫీ' చిత్రాన్ని శృతి హాసన్ నిర్మించబోతోంది. దీనికి సమర్పకురాలిగా కూడా ఆమెనే వ్యవహరించనుండటం విశేషం.

డిఫరెంట్ కంటెంటుతో వచ్చే చిత్రాలను ఇసిడ్రో మీడియాపై నిర్మించాలని నిర్ణయించుకున్నాం. కొత్త ఆలోచనలు, కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడమే లక్ష్యంగా ఇసిడ్రో మీడియా ముందుకు సాగుతుందని శృతి హాసన్ తెలిపారు.
దర్శకుడు జయప్రకాష్ ఎంతో ప్రతిభ ఉన్న ఫిల్మ్ మేకర్ అని, చాలా సింపుల్ స్టోరీస్ కూడా ఆయన తరపై ఎంతో అద్భుతంగా చూపిస్తారు. అతడి చివరి ప్రాజెక్ట్ 'లెన్స్' నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే అతడు తీస్తున్న 'ది మస్కిటో ఫిలాసఫీ' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను అని శృతి హాసన్ తెలిపారు.


Click it and Unblock the Notifications











