అందుకే 'గబ్బర్ సింగ్' ఒప్పుకున్నా
ఇందులో నేను పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తాను.సొంత వ్యక్తిత్వం ఉన్న యువతి ఆమె.'దబాంగ్'లో సోనాక్షి పాత్ర కంటే మిన్నగా ఉంటుంది.'గబ్బర్‌సింగ్'రీమేక్ కథే అయినా దర్శకుడు హరీష్ శంకర్ ప్రతి పాత్రనూ కొత్తగా మలిచారు.అందుకే ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకొన్నా అంటోంది శృతిహాసన్.ఆమె తన తాజా చిత్రం 'ఓ మై ఫ్రెండ్'ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది.అలాగే..తను తెలుగులో చేసిన తెలుగు పరిశ్రమ గురించి చెపుతూ..మా డాడీ చెప్పినట్టే ప్రశాంతంగా ఉంది. ఇక్కడ సినిమా చేస్తున్నాను...అనగానే ఆయన ఓ మాట చెప్పారు..'తెలుగు ప్రేక్షకులు చాలా ప్రత్యేకం. నచ్చితే నెత్తిన పెట్టుకొని చూసుకొంటారు. దేవతలా ఆరాధిస్తారు' అని.
ఆయన చెప్పినట్టే ఉంది.ఇక్కడి వారికి సినిమా ఓ ప్రపంచం.నటీనటులను చాలా అభిమానిస్తారు.నన్ను కూడా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.ఇక ఓ మై ప్రెండ్ చిత్రం గురించి చెపుతూ..ప్రేమ,స్నేహం..సృష్టి మొదలైనప్పటినుంచీ ఆ పదాలు పరిచయమే.అయితే ఇలాంటి కథలు చెప్పడంలో దర్శకుడి కోణం...అభిప్రాయం చాలా ముఖ్యం.వేణు శ్రీరామ్ ఈ కథను మలిచిన విధానం చాలా కొత్తగా ఉంటుంది అంది.ఇక రీసెంట్ గా ఆమె నటించిన సెవెంత్ సెన్స్ భాక్సాఫీస్ వద్ద ఆశించిన రీతిలో విజయం సాధించలేకపోయింది.


Click it and Unblock the Notifications











