‘గబ్బర్ సింగ్’లో పాత్ర నాకు థ్రిల్ ఇస్తోంది
''నేను చిన్నప్పటి నుంచీ పెరిగింది సిటీలోనే కాబట్టి పల్లెటూరి వాతావరణం నాకు తెలియదు. ఆ గెటప్ పై కూడా అవగాహన కూడా లేదు. అందుకని 'గబ్బర్‌సింగ్'లో చేస్తున్న పాత్ర నాకు థ్రిల్ ఇస్తోంది. ఇప్పటివరకు నేను ఏ పాత్ర చేసినా.. వాటిలో నా రియల్ లైఫ్‌కు దగ్గరగా ఉన్న అంశాలు కొన్నయినా ఉన్నాయి. కానీ 'గబ్బర్‌సింగ్'లోని పాత్ర అందుకు పూర్తి భిన్నం. హిందీలో ఈ పాత్రను సొనాక్షి సిన్హా చేశారు. ఆ పాత్రకు ఇప్పుడు నేను చేస్తున్న పాత్రకు చాలా తేడా ఉంది. అంతలా పాత్రలో మార్పులు, చేర్పులు చేశారు. అసలు సిసలు పల్లెటూరి యువతిలా మౌల్డ్ అయ్యి, చేస్తున్నాను. కచ్చితంగా ఓ డిఫరెంట్ శ్రుతిని చూస్తారు. నా స్వభావానికి దూరంగా ఉండటంవల్లనో ఏమో ఈ పాత్ర నాకు చాలా కిక్ అన్పిస్తోంది'' అని శృతిహాసన్ చెప్పుకొచ్చింది.
పవన్ కళ్యాణ్ హీరోగా దబాంగ్ రీమేక్ గా రూపొందుతున్న చిత్రం 'గబ్బర్‌సింగ్'. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభం నుంచీ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా తన పాత్రను గురించి శృతి ఈ విధంగా చెప్పుకొచ్చింది. అలాగే...తన వరస ప్లాపులు అనగనగా ఓ ధీరుడు, సెవెన్త్ సెన్స్, ఓ మై ఫ్రెండ్,దిల్ తో బచ్చా హై జీ ను ప్రస్తావిస్తూ...సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ అనేది మన చేతుల్లో ఉండదు. కానీ నేను ఒప్పుకున్న పాత్రకు న్యాయం చేయడం అనేది నా చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, పాత్రను పండించడానికి ఎంతవరకు కృషి చేయాలో అంతా చేస్తాను'' అంది. త్వరలో ఆమె నటించిన తమిళ చిత్రం '3' విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











