తప్పు చేయటం కామన్: శృతి హాసన్
సిద్దార్ధ గర్ల్ ప్రెండ్ గా వెలుగుతున్న శృతి హాసన్ కి తనకంటూ కొన్ని స్వంత అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నాయి. వాటి గురించి ఆమె మీడియా దగ్గర మనస్సు విప్పింది. జీవితంలో ఏదైనా అంతే. ఎన్ని తప్పులు చేస్తే... అన్ని అధ్బుతమైన ఫలితాలు సాధించవచ్చు అంటోంది శృతిహాసన్. ఆమె తొలిసారి కెమెరాని ఫేస్ చేసిన నాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఇలా స్పందించింది. ఆమె మాటల్లోనే.. తొలిసారి కెమెరాను ఎదుర్కొన్న సందర్భం నాకు గుర్తుంది. మాటలు తడబడేవి. శరీరం వణుకుతూ ఉండేది. కట్ చెప్పినా, ఆ ప్రభావం నుంచి బయటకు రాలేకపోయేదాన్ని. 'మరో టేక్ చేద్దాం' అని దర్శకుడిని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి.
ఏ దశలో తప్పు చేస్తామో, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తొలి దశలోనే నేర్చుకొన్నాను అంది.అలాగే వృత్తిలో ఇతరుల సలహాలు ఎంతవరకూ పనికి వస్తాయో చెబుతూ.. ఒక దశ వరకూ సలహాలు తీసుకోవడంలో తప్పులేదు. కానీ ప్రతీసారీ మరొకరి మాట సాయం కోసం ఎదురుచూడకూడదు. సలహాలు ఎక్కువైతే ఏది ఆచరణలో పెట్టాలో అర్థం కాదు. అందుకే వాటికి నేను దూరంగా ఉంటానని చెబుతోంది. ప్రస్తుతం ఆమె సిద్దార్ద సరసన ఓహ్ మై ప్రెండ్ చిత్రం చేస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ చిత్రాన్ని వేణు శ్రీరామ్ అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే ఆ చిత్రంలో హన్సిక మరో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంతో పాటు శృతి హాసన్... ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ చిత్రాలు చేస్తోంది వీటితో పాటు ఆమె సంగీతం, పాటలు పాడటం వంటివి కూడా చేస్తూ తనను తాను ఎప్పుడూ బిజీ చేసుకుంటోంది.


Click it and Unblock the Notifications











