twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి ‘బాహుబలి’లో రాజకుమారిగా ఆమెనే?

    By Srikanya
    |

    హైదరాబాద్: 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంలో రాజకుమారి పాత్రలో శృతి హాసన్ ప్రేక్షకుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. సినిమా ప్లాప్ అయినా ఆమెకు వచ్చిన క్రేజే వేరు. దాంతో రాజమౌళి తాజా చిత్రం 'బాహుబలి' లో ఓ ముఖ్య పాత్రకు గానూ ఈ సుందరిని ఎంపికచేశాడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని చిత్ర వర్గాల సమాచారం.

    'గబ్బర్‌సింగ్'తో తారాపథంలో స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్లిన శృతి హాసన్ ప్రస్తుతం రవితేజ 'బలుపు'తో పాటు ఎన్టీఆర్ హీరోగా హరీష్‌శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో ప్రత్యేకపాత్రలో నటిస్తోంది. దాంతో ప్రభాస్, అనుష్క హీరోహీరోయిన్లుగా నటించబోతున్న ఈ బాహుబలి చిత్రంలో శృతి హాసన్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న కీలకమైన పాత్రను పోషించబోతున్నారు. నాగబాబు కూడా మరో ముఖ్యపావూతలో కనిపిస్తారు.

    ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో క్రేజీ ప్రాజెక్ట్ 'బాహుబలి'. దాదాపు వందకోట్ల రూపాయల వ్యయంతో రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ పీరియడ్ చిత్రానికి సంబంధించిన ఏ సమాచారమైనా ప్రేక్షకుల్లో అమితాసక్తిని రేకెత్తిస్తోంది. 'బాహుబలి' చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనుంది. 'ఈగ' చిత్రాన్ని మూడు భాషల్లో విడుదల చేసి దాదాపు 70కోట్ల రూపాయల రెవెన్యూను పొందగలిగారు రాజమౌళి. దాంతో 'బాహుబలి' చిత్రానికి అంతకుమించి రెవెన్యూను సాధించగలననే ధీమాతో రాజమౌళి వున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ప్రభాస్, రానా అన్నదమ్ముల్లుగా నటించబోతున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.

    English summary
    Shruti Hassan is making a boom, she is exclusively working for three prestigious projects of the T'TOWN, BALUPU with Ravi Teja, ‘YEVADU’ with ‘Ram Charan Teja’, and an Untitled Harish Shankar’s project with Ntr, and finally it is heard that Shruti is making a big one with Rajamouli.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X