కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు : శ్రుతి హాసన్
'విజయాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. కష్టపడినదానికి ఫలితం వచ్చింది అనుకుంటారు. కరక్టే, కానీ ఆ విజయం తరువాత మరింత కష్టపడాల్సిన బాధ్యత ఉంటుందని గ్రహించరు అని అంది. తన దృష్టిలో రెండూ సమానమే అంటోంది.
ఈ విషయంలో నాకు అమితాబ్ బచ్చన్ ఆదర్శం. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఆయన స్పందించే తీరు ఒకేలా ఉంటుంది. ఇప్పుడిప్పుడే నాకూ ఆ తీరు అలవాటు అవుతోంది' అని చెబుతోంది శ్రుతి. ''నేను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో నటించాను. వీటిలో ఏది బాగుంది.. తేడా ఏమిటి అని అడిగితే.. నేను చెప్పలేను. నాకు అన్ని చిత్రసీమలూ ఒకటే'' అంటోంది శ్రుతిహాసన్.
మూడు భాషల్లో చేస్తున్నారు కదా.. ఏమైనా తేడాలు గమనించారా అని అడిగితే.. ''నా వరకూ భాషతో సంబంధం లేదు. కేవలం షూటింగ్ ప్రదేశాలు, వ్యక్తులు మాత్రమే మారినట్టు భావిస్తాను. ఒక్కో యూనిట్ నుంచి ఒక్కో కొత్త విషయం తెలుసుకుంటాను. ఒక్కొ యూనిట్ నుంచి చాలా విషయాలు తెలుస్తాయి. అవి పాఠాల్లాంటివే. వాటిని గుర్తుంచుకొవాలి. అవి వ్యక్తిగత జీవితానికీ ఎంతో ఉపయోగపడతాయి''అని చెప్పింది.
నటన వైపు వచ్చేశారు.. ఇక సంగీతానికి స్వస్తి చెప్పినట్లేనా అంటే ''అలాంటిదేమీ లేదు సంగీతం నా జీవితంలో భాగం. అయితే ప్రస్తుతానికి సంగీత దర్శకత్వంపై దృష్టి పెట్టడానికి కుదరడం లేదు. నాకు వీలైన వెంటనే ఓ అల్బమ్ రూపొందిస్తాను''అని చెప్పింది శ్రుతి. ఈ భామ ప్రస్తుతం 'రామయ్యా వస్తావయ్యా', 'ఎవడు' చిత్రాలు చేస్తోంది. హిందీలో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications












