»   » శృతి హాసన్...చాలా సెక్సీగా ఉన్నావ్ బంగారం (ఫోటోస్)

శృతి హాసన్...చాలా సెక్సీగా ఉన్నావ్ బంగారం (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా హాట్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ తాజాగా ఓ విషయంలో అభిమానుల ద్వారా ప్రశంసలు అందుకుంటోంది. సినీబ్లిట్జ్ మేగజైన్ మే నెల ఇష్యూ కోసం హాట్ ఫోజులు ఇచ్చిన ఆమె స్టిల్స్ చూసిన ఫ్యాన్స్ చాలా సెక్సీగా ఉన్నావ్ బంగారం అంటూ పొగిడేస్తున్నారు.

ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ట్రెండ్ ఎలా ఉందంటే...హీరోయిన్లు నిలదొక్కుకోవాలంటే గ్లామర్‌ పరంగా కూడా పబ్లిసిటీ పెంచుకోవాల్సిన పరిస్థితి. అందుకే వరుస అవకావాలతో దూసుకెలుతున్న హీరోయిన్లు సైతం హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లతో వెబ్ సైట్లు, మేగజైన్లు లాంటి మాధ్యమాల్లో తమ అందాల విందు చేస్తున్నారు.

అందులో భాగంగా హీరోయిన్ శృతి హాసన్ కూడా ఓ వైపు స్టార్ హీరోయిన్‌గా తన ప్రయాణం కొనసాగిస్తూనే.....గ్లామర్ ప్రపంచంలో పోటీని తట్టుకునేందుకు ఫోటో షూట్లతో ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తోంది. తాజాగా ఆమె సినీబ్లిట్జ్ మేగజైన్ కోసం సెక్సీగా ఫోజులు ఇచ్చింది. 

శృతి హాసన్

శృతి హాసన్

శృతి హాసన్ పూర్తి పేరు శృతి రాజ్యలక్ష్మి హాసన్. ప్రముఖ నటుడు కమల్ హాసన్, సారిక దంపతులకు జనవరి 28, 1986లో జన్మించింది. ఆమె కేవలం నటి మాత్రమే కాదు...మంచి సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా.

కమల్ హాసన్ కూతురు

కమల్ హాసన్ కూతురు

కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది.

తెరంగ్రేటం

తెరంగ్రేటం

బాలీవుడ్ మూవీ ‘లక్' చిత్రం ద్వారా శృతి హాసన్ 2009లో హీరోయిన్‌గా కోరీర్ ప్రారంభించింది. అయితే తొలి చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలేవీ రాలేదు. ఆ తర్వాత 2011లో ‘అనగనగా ధీరుడు' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

గబ్బర్ సింగ్

గబ్బర్ సింగ్

దశ తిరిగింది కారణం ఏమిటో తెలియదు కానీ మొదట చేసిన 7 సినిమాలకు శృతి హాసన్‌కు కలిసిరాలేదు. 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా తొలి విజయం రుచి చూసింది. ఆ తర్వాత ఆమె పలు సినిమాలతో బిజీ అయింది.

సినిమాలు

సినిమాలు

ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో మహేష్ బాబు సరసన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు మూడు హిందీ సినిమాలు, రెండు తమిళ చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Shruti Hassan Photo Shoot For Cineblitz Magazine Photos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu