వివాదానికి దారి తీసిన శృతి హాసన్ సెక్స్ ఫోజు
హైదరాబాద్ : హీరోయిన్ శృతి హాసన్ 'డి-డే' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో శృతి హాసన్ పాకిస్థాన్ వేశ్యగా కనిపించబోతోంది. ఇటీవల విడుదలైన ఆచిత్రం పోస్టర్లో శృతి హాసన్ సెక్స్ భంగిమ ఫోజు సంచలనం సృష్టించింది. ఉన్నట్టుండి ఆ సినిమాకు ఎక్కడలేని పబ్లిసిటీని తెచ్చిపెట్టింది.
అయితే ఇపుడు అదే ఫోస్టర్ వివాదానికి కారణమైంది. ముంబైలోని కొన్ని సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఈ పోస్టర్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో నుండి ఆ సీన్ తొలగించక పోతే తీవ్రపరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు.
ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను బేస్ చేసుకుని డి-డే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నిఖిల్ అద్వానీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రామ్ పాల్, రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, శృతి హాసన్, హుమా ఖురేషి, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జులై 19న ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం శృతి హాసన్ రవితేజతో బలుపు, రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందుతున్న ఎవడు చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా అల్లు అర్జున్ హీరోగా త్వరలో రూపొందబోయే 'రేస్ గుర్రం' చిత్రంలో కూడా శృతి హాసన్ ఎంపికయింది. మరో వైపు శృతి హాసన్ హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తోంది. తెలుగులో హిట్టయిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రానికి ఇది రీమేక్.


Click it and Unblock the Notifications











