నాకు 'గబ్బర్‌ సింగ్‌' కన్నా తిక్క ఎక్కువే

By Srikanya

మీకు తెలీదేమో? నాకు గబ్బర్‌ సింగ్‌ కన్నా తిక్క ఎక్కువే. ఎవరైనా సరే... నా తాకిడికి పారిపోవలసిందే అంటోంది శృతి హాసన్. ఆమెను మీడియా వారు.. గబ్బర్‌ సింగ్‌ లాంటి తలతిక్క మనిషి మీ జీవితంలోనూ ఎదురైతే.. పరిస్ధితి ఏమిటని ప్రశ్నిస్తే ఇలా స్పందించింది. అలాగే 'గబ్బర్‌ సింగ్‌' గురించే అందరూ గురించే మాట్లాడుకొంటుంటే... అది వింటూ నేనూ ఆనందపడిపోతున్నా. ట్విట్టర్‌లోకి వెళ్తే ఎన్ని సందేశాలో.. ఇప్పటి వరకూ నేను నటించిన సినిమాలు ఇవ్వలేని సంతృప్తి 'గబ్బర్‌ సింగ్‌'తో లభించింది అని తేల్చి చెప్పింది.

హిందీ చిత్రం లక్ తో పరిచయమైన శృతి హాసన్... తెలుగు, తమిళ, హిందీ... మూడు చోట్లా సినిమాలు చేసినా, సరైన హిట్ దక్కించుకోలేకపోయింది. అందరూ ఐరన్ లెగ్ అని కామెంట్ చేసే స్ధితికి వెళ్లింది. హై ఎక్సపెక్టేషన్స్ మధ్య పెద్ద హీరోలు, దర్శకులతో చేసిన 'సెవెన్త్‌ సెన్స్‌', 'ఓ మై ఫ్రెండ్‌', 'త్రీ' లాంటి చిత్రాల్లో మంచి నటన కనబరచినా ఫలితం లేకుండా పోయింది. అయితే శృతికి తొలి విజయం 'గబ్బర్‌ సింగ్‌' ద్వారా దక్కింది. భాగ్యలక్ష్మిగా లంగా వోణీలో కనిపించి అలరించింది.

ఇక కమల్ హాసన్ తన హిట్ చిత్రాన్ని ఇంకా సినిమా చూళ్లేదని చెప్పింది. ఎందుకంటే 'విశ్వరూపం' సినిమా కోసం విదేశాల్లో ఉన్నారు. కచ్చితంగా ఆయనకూ ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది. నేనైతే ముంబైలోని పక్కా మాస్‌ థియేటర్లో సినిమా చూశా. థియేటర్లో జనం పవన్ కళ్యాణ్ సంభాషణలకీ, ఆయన నటనకీ స్పందించిన తీరు నాకెంతో ఆనందాన్నిచ్చింది అని మురిసిపోయింది.

పవన్ కళ్యాణ్ తో గురించి చెపుతూ... ఆయన చాలా మంచి మనిషి. సినిమాలో 'నాక్కొంచెం తిక్కుంది..' అనే డైలాగ్‌ ఉంది. నిజ జీవితంలో మాత్రం... ఆయన మృదుస్వభావి అని కాంప్లిమెంట్ ఇచ్చింది. అలాగే రామ్‌తో నటించబోతున్నారనే వార్తలని ఆమె ఖండించింది. 'గబ్బర్‌ సింగ్‌' తరవాత కొత్త సినిమాలేం ఒప్పుకోలేదు. తమిళం నుంచి కూడా చాలా అవకాశాలొస్తున్నాయి. త్వరలోనే కొత్త సినిమాల కబుర్లు చెబుతాను అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X