రివ్యూలంటేనే ఆమెకు కాలుతోంది
కమల్ హాసన్ ముద్దుల కుమార్తె హీరోయిన్ గా చేసిన 'లక్' సినిమా భాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాని సంగతి తెలిసిందే. అయితే ఆ రిజల్ట్ ని 'లక్' చిత్రం దర్శక,నిర్మాతలు దాన్ని ఏక్సెప్ట్ చేసినా శ్రుతి మాత్రం తట్టుకోలేకపోతోంది. తమ చిత్రాన్ని రివ్యూలే నాశనం చేసాయంటూ రీసెంట్ గా ఓ హిందీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వూలో తిట్టి పోసింది. తను చిన్నప్పటి నుంచి ఫిల్మ్ రివ్యూలంటే చిరాకని చెప్పుకొచ్చింది. తనకు పద్నాలుగు ఏళ్ళ వయస్సులో తన తండ్రి నటించిన 'హే రామ్' రిలీజైందని, అయితే దానని రివ్యూల పేరతో ఏకి పారేసారాని గుర్తు చేసుకుంది. దాంతో తాను చాలా హర్ట్ అయ్యానని,దాని నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని,తన తండ్రి ఓదార్చాల్సి వచ్చిందని జ్ఞాపకం చేసుకుంది. ఇప్పుడు అలాంటి సిట్యువేషన్ లక్ సినిమాతో ఎదుర్కోవాల్సి వచ్చిందని అంటోంది. ఇక ప్రస్తుతం తాను సంగీత దర్శకత్వం వహించిన 'ఈనాడు' చిత్రం రిలీజ్ కాబోతోందని గుర్తు చేసింది. అంటే తననేమీ విమర్శించవద్దని ముందే ప్రిపేర్ చేస్తోందన్నమాట.


Click it and Unblock the Notifications











