twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓ మంచి పనికే శృతి హాసన్ ఇలా సెక్సీగా...(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. తెరంగ్రేటం చేసిన మొదట్లో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది.

    కొద్ది రోజుల క్రితం కామసూత్ర భంగిమతో అలజడి రేపిన శృతిహాసన్ ..తను ఎలాంటి ఎక్సపోజింగ్ కైనా రెడీ అన్నట్లు సంకేతాలు వదిలింది. గబ్బర్ సింగ్ వరకూ తెలుగులో సరైన హిట్టులేని శృతిహాసన్‌ ఆ సినిమా హిట్ కావడంతో అందరికీ గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి.

    'డాడీ పేరు సినిమా రంగంలో ఎప్పుడూ వాడుకోలేదు. కమల్‌ కూతురు అని ఎవరూ నాకు పనిగట్టుకొని అవకాశాలూ ఇచ్చేయలేదు. కానీ నాలో నటనకు, సంగీతానికి... సినిమా అంటే ప్రేమ పెరగడానికి బీజం వేసింది మాత్రం డాడీనే. సినిమా అంటే వ్యామోహం ఆయన వల్లే కలిగింది' అంటోంది శృతిహాసన్.

    తాజాగా శృతి హాసన్ మహిళ శక్తిని చాటిచెప్పేలా ఓ ఫోటో షూట్లో పాల్గొంది. అందుకు సంబంధించిన ఫోటోలను స్లైడ్ షోలో చూద్దాం...

    శృతి హాసన్

    శృతి హాసన్

    శృతి హాసన్ పూర్తి పేరు శృతి రాజ్యలక్ష్మి హాసన్. ప్రముఖ నటుడు కమల్ హాసన్, సారిక దంపతులకు జనవరి 28, 1986లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 27. ఆమె కేవలం నటి మాత్రమే కాదు...మంచి సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా.

    తెరంగ్రేటం

    తెరంగ్రేటం

    బాలీవుడ్ మూవీ ‘లక్' చిత్రం ద్వారా శృతి హాసన్ 2009లో హీరోయిన్‌గా కోరీర్ ప్రారంభించింది. అయితే తొలి చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలేవీ రాలేదు. ఆ తర్వాత 2011లో ‘అనగనగా ధీరుడు' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

    గబ్బర్ సింగ్‌తో దశ తిరిగింది

    గబ్బర్ సింగ్‌తో దశ తిరిగింది


    కారణం ఏమిటో తెలియదు కానీ మొదట చేసిన 7 సినిమాలకు శృతి హాసన్‌కు కలిసిరాలేదు. 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా తొలి విజయం రుచి చూసింది. ఆ తర్వాత ఆమె పలు సినిమాలతో బిజీ అయింది.

    తెలుగు చిత్రాలు

    తెలుగు చిత్రాలు

    ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో నటించి ‘ఎవడు' చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు ఆమో జూ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. దీంతో పాటు అల్లు అర్జున్ సరసన రేస్ గుర్రం చిత్రంలోనూ చేస్తోంది.

    బాలీవుడ్ ప్రాజెక్టులు

    బాలీవుడ్ ప్రాజెక్టులు

    మరో వైపు బాలీవుడ్ లోనూ శృతి హాసన్ బిజీగా గడుపుతోంది. ఇటీవల ఆమె హిందీలో నటించిన డి-డే, రామయ్యా వస్తావయ్యా చిత్రాలు విడుదల కాగా....త్వరలో షూటింగ్ మొదలు కానున్న వెల్ కం బ్యాక్, గబ్బర్ చిత్రాల్లోనూ నటించబోతోంది.

    English summary
    Shruti Haasan is an Indian actress, singer and music composer who works in the South Indian film industry and Bollywood. Her parents are noted actors Kamal Haasan and Sarika.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X