తమన్నా కి ట్విస్ట్.... ఆ ప్లేస్ లోకి శ్రుతిహాసన్
ముంబై: శృతిహాసన్ టైమ్ మొదలైంది. గబ్బర్ సింగ్ తర్వాత ఆమె గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. బలుపు విజయంతో ఆమెకు తెలుగులోనూ హవా మొదలైంది. మరోప్రక్క రామయ్య వస్తావయ్యా, డి డే విజయం సాధించటంతో బాలీవుడ్ సైతం ఆమెను కన్సిడర్ చేస్తోంది. ఈ నేపధ్యంలో తమన్నాకు అనుకున్న ప్రాజెక్టు ...శ్రుతిహాసన్ కి చేరింది.
విజయకాంత్ ప్రధానపాత్రధారిగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో గతంలో విడుదలైన చిత్రం 'రమణ'. ఆ చిత్రం తెలుగులో ఠాగూర్ పేరుతో విడుదలై ఇక్కడా మంచి విజయం సాధించింది. అవినీతి వ్యతిరేక కథాంశంతో తెరకెక్కి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతోంది.
అక్షయ్‌కుమార్ హీరో . క్రిష్ దర్శకుడు. అక్షయ్‌కి జంటగా తమన్నా నటించనున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ అవకాశం కమల్ గారాలపట్టి శ్రుతిహాసన్‌ను చేరినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిర్మాణవర్గాలు కూడా ధ్రువీకరించాయి. శ్రుతిహాసన్ హీరోయిన్ గా బాలీవుడ్‌లో కెరీర్‌ను ప్రారంభించింది. 'లక్' ద్వారా వచ్చిన ఆమెకు ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. ఇప్పుడు తెలుగు, తమిళ పరిశ్రమల్లో గుర్తింపు తెచ్చుకున్న శ్రుతికి ఈసారి ఎలాంటి ఫలితం ఎదురవుతుందో వేచిచూడాలి.


Click it and Unblock the Notifications












