»   » కోకలో కేక: శృతి హాసన్ సెక్సీ లుక్ (ఫోటోలు)

కోకలో కేక: శృతి హాసన్ సెక్సీ లుక్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్: ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ట్రెండ్ ఎలా ఉందంటే...హీరోయిన్లు నిలదొక్కుకోవాలంటే గ్లామర్‌ పరంగా కూడా పబ్లిసిటీ పెంచుకోవాల్సిన పరిస్థితి. అందుకే వరుస అవకావాలతో దూసుకెలుతున్న హీరోయిన్లు సైతం హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లతో వెబ్ సైట్లు, మేగజైన్లు లాంటి మాధ్యమాల్లో తమ అందాల విందు చేస్తున్నారు.

    అందులో భాగంగా హీరోయిన్ శృతి హాసన్ కూడా ఓ వైపు స్టార్ హీరోయిన్‌గా తన ప్రయాణం కొనసాగిస్తూనే.....గ్లామర్ ప్రపంచంలో పోటీని తట్టుకునేందుకు ఫోటో షూట్లతో ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తోంది. ఇటీవల మేగజైన్ కోసం సెక్సీగా రెచ్చి పోయిన శృతి హాసన్, మరో వైపు చీర సింగారంలో శృంగార దేవతగా దర్శనమిచ్చింది.

    అందుకు సంబంధించని ఫోటోలు, శృతి హాసన్ గురించి వివరాలు స్లైడ్ షోలో...

    కమల్ హాసన్ వారసురాలిగా...

    కమల్ హాసన్ వారసురాలిగా...


    కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది.

    గబ్బర్ సింగ్

    గబ్బర్ సింగ్


    గబ్బర్ సింగ్ వరకూ తెలుగులో సరైన హిట్టులేని శృతిహాసన్‌ ఆ సినిమా హిట్ కావడంతో అందరికీ గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి.

    డాడీ పేరు వాడుకోలేదు..

    డాడీ పేరు వాడుకోలేదు..


    'డాడీ పేరు సినిమా రంగంలో ఎప్పుడూ వాడుకోలేదు. కమల్‌ కూతురు అని ఎవరూ నాకు పనిగట్టుకొని అవకాశాలూ ఇచ్చేయలేదు. కానీ నాలో నటనకు, సంగీతానికి... సినిమా అంటే ప్రేమ పెరగడానికి బీజం వేసింది మాత్రం డాడీనే. సినిమా అంటే వ్యామోహం ఆయన వల్లే కలిగింది' అంటోంది శృతిహాసన్.

    శృతి హాసన్

    శృతి హాసన్


    శృతి హాసన్ పూర్తి పేరు శృతి రాజ్యలక్ష్మి హాసన్. ప్రముఖ నటుడు కమల్ హాసన్, సారిక దంపతులకు జనవరి 28, 1986లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 27. ఆమె కేవలం నటి మాత్రమే కాదు...మంచి సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా.

    తెరంగ్రేటం

    తెరంగ్రేటం


    బాలీవుడ్ మూవీ ‘లక్' చిత్రం ద్వారా శృతి హాసన్ 2009లో హీరోయిన్‌గా కోరీర్ ప్రారంభించింది. అయితే తొలి చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలేవీ రాలేదు. ఆ తర్వాత 2011లో ‘అనగనగా ధీరుడు' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

    దశ తిరిగింది

    దశ తిరిగింది


    కారణం ఏమిటో తెలియదు కానీ మొదట చేసిన 7 సినిమాలకు శృతి హాసన్‌కు కలిసిరాలేదు. 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా తొలి విజయం రుచి చూసింది. ఆ తర్వాత ఆమె పలు సినిమాలతో బిజీ అయింది.

    తెలుగు చిత్రాలు

    తెలుగు చిత్రాలు


    ప్రస్తుతం శృతి హాసన్ తెలుగులో నటించి ‘ఎవడు' చిత్రం ఇటీవల విడుదలైన బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించింది. ప్రస్తుతం ఆమె అల్లు అర్జున్ సరసన రేస్ గుర్రం చిత్రంలోనూ నటిస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో రాబోయే చిత్రంలో మహేష్ బాబు సరసన అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

    బాలీవుడ్ ప్రాజెక్టులు

    బాలీవుడ్ ప్రాజెక్టులు


    మరో వైపు బాలీవుడ్ లోనూ శృతి హాసన్ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె వెల్ కం బ్యాక్, గబ్బర్ చిత్రాల్లోనూ నటించబోతోంది.

    English summary
    Shruti Haasan is an Indian actress, singer and music composer who works in the South Indian film industry and Bollywood. Her parents are noted actors Kamal Haasan and Sarika.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more